సిమ్లా: బైక్ స్టంట్ బెడిసికొట్టింది. బైక్ స్కిడ్ కావడంతో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. స్టంట్ చేసిన బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. (Bike Skids During Stunt) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నాగ్చాలాకు చెందిన 22 ఏళ్ల అనికేత్ బిటెక్ విద్యార్థి. ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో పాపురల్ అయిన అతడు శనివారం అర్ధరాత్రి వేళ రీల్ కోసం ప్రయత్నించాడు. కిర్తాపూర్-మనాలీ నాలుగు లేన్ల రహదారిలోని మలోరి టన్నెల్ సమీపంలో బైక్‌పై స్టంట్ చేశాడు.
కాగా, ఆ స్టంట్ బెడిసికొట్టింది. అనికేత్ బైక్‌పై నియంత్రణ కోల్పోయాడు. టన్నెల్ మలుపు వద్ద రోడ్డుపై బైక్ జారడంతో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో అనికేత్ మెడ విరిగింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనికేత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు.
మరోవైపు ఈ ప్రమాదకర స్టంట్‌కు ప్రయత్నించమని అనికేత్‌ను ప్రేరేపించిన వీడియోగ్రాఫర్‌ను ఈ కేసులో నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, కెమెరా ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్టంట్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Please everyone, drive carefully, don’t risk your life for reels or videos. Lost one of my known ones yesterday, just 21, the only child of his family, gone too soon after his bike hit a roadside barricade while filming a reel. Life is too precious for a few seconds of fame. 💔 pic.twitter.com/LFIgXXebgt
— Nikhil saini (@iNikhilsaini) October 26, 2025
Also Read:
Thief Runs Away With Cash Bag | టీ కోసం వేచి ఉన్న వ్యాపారి.. రూ.75 లక్షలున్న బ్యాగ్ చోరీ
Cops Raid Illegal Arms Factory | ఫామ్‌హౌస్‌లో గుట్టుగా ఆయుధాలు తయారీ.. రైడ్ చేసిన పోలీసులు
Watch: స్కూల్ యూనిఫాంలో అమ్మాయిలు.. లిక్కర్ షాపులో మద్యం కొనుగోలు