భోపాల్: స్కూల్ యూనిఫాంలో ఉన్న అమ్మాయిలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని లిక్కర్ షాపు వద్దకు వెళ్లారు. మద్యం కొనుగోలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (Girls In School Uniform Buys Alcohol) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు నైన్‌పూర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లారు. ఆ షాపు నుంచి మద్యాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే స్పందించారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అశుతోష్ ఠాకూర్, తహసీల్దార్, స్థానిక పోలీసులతో కలిసి ఆ ప్రభుత్వ లిక్కర్ షాపు వద్దకు చేరుకున్నారు.
మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బాలికలకు మద్యం అమ్మడంపై అధికారులు ఆరా తీశారు. లిక్కర్ షాపు యజమానిని విచారిస్తున్నారు. ఆ అమ్మాయిలు వారికి వారే అక్కడకు వచ్చారా? లేక ఎవరైనా వారిని పంపించారా? అన్న దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఎస్డీఎం ఆదేశించారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
भाजपा सरकार की शराब की दुकान अब स्कूली छात्राओं तक पहुंच गई है… नियमानुसार नाबालिगों को शराब नहीं बेची जा सकती है लेकिन शराब प्रेमी सरकार यह भी कर गुजरना चाहती है। pic.twitter.com/9yOStqNOvW
— Ravindra Sahu Jhoomarwala (@RavindraSahuINC) October 25, 2025
Also Read:
MLA With Helmet | ఎరువుల కొరతపై రైతుల ఆందోళన.. హెల్మెట్ ధరించి లైన్లో నిల్చొన్న ఎమ్మెల్యే
Cops Raid Illegal Arms Factory | ఫామ్‌హౌస్‌లో గుట్టుగా ఆయుధాలు తయారీ.. రైడ్ చేసిన పోలీసులు
Watch: మహిళ మొబైల్ ఫోన్ నేలకు విసిరికొట్టి.. ఆమె చెంపపై కొట్టిన పోలీస్