భోపాల్: ఎరువుల కొరతపై రైతుల ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. గంటల తరబడి లైన్లో ఉన్నప్పటికీ ఎరువులు అందడం లేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే హెల్మెట్ ధరించి లైన్లో నిల్చొని నిరసన తెలిపారు. (MLA With Helmet) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. పలు జిల్లాల్లో ఎరువుల కొరతపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పొడవైన క్యూలైన్లపై ఆగ్రహించిన రైతులు అధికారులతో ఘర్షణ పడుతున్నారు.
కాగా, కొన్ని రోజుల కిందట రేవాలో ఎరువుల కోసం వరుసలో వేచి ఉన్న రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సత్నాలో రైతుల నిరసనల కారణంగా బీజేపీ ఎమ్మెల్యే ప్రతిమా బాగ్రీ తన మార్గాన్ని మార్చుకున్నారు.
మరోవైపు తాజాగా ఎరువుల కొరత వివాదానికి శివపురి కేంద్రంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కైలాష్ కుష్వాహా హెల్మెట్ ధరించారు. సాధారణ రైతు మాదిరిగా ఎరువుల టోకెన్ల కోసం వరుసలో నిల్చొన్నారు. రైతులకు మద్దతుగా ఈ మేరకు ఆయన నిరసన తెలిపారు. అధికారుల తీరుపై మండిపడ్డారు.
కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే కైలాష్ కుష్వాహా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఉదయం 4 గంటల నుంచి రైతులు వరుసలో నిల్చొని ఉన్నారని ఆరోపించారు. అయినప్పటికీ అధికారులు, ఎస్డీఎం లేదా తహశీల్దార్ ఎవరూ లేరని విమర్శించారు. ‘తోసుకోవడం, తోపులాట జరుగుతున్నది. తాగడానికి నీరు లేదు. కూర్చోవడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు’ అని మండిపడ్డారు. ముఖాల ఆధారంగా ఎరువుల టోకెన్లు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కలెక్టర్‌కు ఆయన ఫోన్ చేశారు. తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also Read:
Cops Raid Illegal Arms Factory | ఫామ్‌హౌస్‌లో గుట్టుగా ఆయుధాలు తయారీ.. రైడ్ చేసిన పోలీసులు
Watch: మహిళ మొబైల్ ఫోన్ నేలకు విసిరికొట్టి.. ఆమె చెంపపై కొట్టిన పోలీస్