న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యంపై రాజకీయ వివాదం కొనసాగుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ యూనిట్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం యమునా నది నుంచి మురికి నీటిని ఒక బాటిల్లో సేకరించారు. (AAP brings Yamuna water to CM) ఆప్ నేతలతో కలిసి సీఎం రేఖ గుప్తా నివాసానికి చేరుకున్నారు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ యమునా నదిని శుభ్రం చేసిందని భావిస్తే ఆ బాటిల్ లోని నీటిని సీఎం రేఖ గుప్తా తాగాలని సౌరభ్ భరద్వాజ్ సవాల్ చేశారు. ఛత్ పూజకు ముందు అబద్ధాలను బీజేపీ వ్యాప్తి చేస్తున్నదని ఆయన ఆరోపించారు.
కాగా, బీజేపీ ప్రభుత్వం నెలల తరబడి శుద్ధి చేసిన తర్వాత యమునా నది నీరు ఆచారాలకు అనుకూలంగా ఉన్నదని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ గుప్తా తెలిపారు. గురువారం ఆచమనం చేసిన ఆయన ఆ నీటిని తాగారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ఆప్ ఢిల్లీ యూనిట్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ ఈ మేరకు స్పందించారు. ‘బీజేపీ అబద్ధాల కారణంగా యమునా నదిని సీఎం శుభ్రం చేశారని లక్షలాది మంది పూర్వాంచల్ మహిళలు, చిన్న పిల్లలు భావిస్తారు. ఛత్ పూజ సందర్భంగా ఆ నీటిని తాగుతారు. ఆ తర్వాత ప్రాణాంతక అనారోగ్యానికి గురవుతారు’ అని అన్నారు.
Also Read:
Tej Pratap Yadav | ఆర్జేడీలోకి తిరిగి రావడం కంటే సావటమే బెటర్ : తేజ్ ప్రతాప్ యాదవ్
Cops Raid Illegal Arms Factory | ఫామ్‌హౌస్‌లో గుట్టుగా ఆయుధాలు తయారీ.. రైడ్ చేసిన పోలీసులు
Watch: మహిళ మొబైల్ ఫోన్ నేలకు విసిరికొట్టి.. ఆమె చెంపపై కొట్టిన పోలీస్