నల్లగొండ, మార్చి 17 : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 20 నుండి ఏప్రిల్ 5 వరకు సిపిఐ ఎం పార్టీ ఆధ్వర్యంలో అధ్యయన బృందాలు బయల్దేరి పర్యటనలు చేయాలన్నారు. మంగళవారం నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల విస్తృత సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ల కోసం పని చేస్తున్నారని, ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు, అభివృద్ధి విషయంలో పట్టి పట్టనట్లు వ్యవహరించడం, దేశవ్యాప్తంగా ప్రజలని భావోద్వేగాల మధ్యన రగిలిస్తూ మత చిచ్చుకు కారణమవుతున్నాడన్నారు. దేశంలో కులం, మతోన్మాదం అంటూ ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి ఆర్థిక ప్రయోజనాలు కార్పొరేటర్ శక్తులకు దోచిపెడుతున్నట్లు తెలిపిరు. లేబర్ కోడ్స్ ను తీసుకువచ్చి 50 కోట్ల మంది కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఊరడిస్తూ అదిగో వస్తుంది చూడు అంటూ ఆశలు రేకెత్తించి రైతులను అప్పులపాలు చేసే విధంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు పెట్టిన అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ప్రకారం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రాధాన్యత ప్రకారంగా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తమ బడ్జెట్లో నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు సన్నద్ధం కావాలన్నారు. నల్లగొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాటాడుతుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల మీద తమ పాలసీని బహిరంగపరచాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలి : జాన్ వెస్లీ
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి గారు మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండిస్తున్న ధాన్యం కొనుగోలు చేసేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పండించిన పంటనంత మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యలపై ప్రత్యక్ష ఆందోళన చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా వేసవి వస్తున్నందున మంచినీళ్లు, మౌలిక సమస్యలైనా రోడ్లు, కరెంట్ ఇతర సమస్యల పైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామాలలో పర్యటన చేసి ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలని ఆయన పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో ఉపాధి హామీ పొందుతున్న నిరుపేదలకు చాలా గ్రామాలలో పెండింగ్ బిల్లులో వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ 20 నుండి ఏప్రిల్ 5 వరకు అన్ని గ్రామాలలో సిపిఎం పర్యటనల ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు బృందాలుగా బయలుదేరాలని పిలుపునిచ్చారుజ ఈ సమస్యలన్నింటిని అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి వినతి పత్రాల ద్వారా తెలియజేయాలన్నారు. కరెంట్ కోతలు, పొలాలు ఎండిపోవడం, మంచినీళ్లు కటకట ఏర్పడడం ఇతర సమస్యల పైన ఫోకస్ చేసి సిపిఎం పార్టీ ప్రజా సమస్యలపై ఆందోళన చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారీ ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, బొంతల చంద్రారెడ్డి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జట్ట నగేశ్, ఏ.శంకరయ్య, సిహెచ్ బయన్న, వెంచర్ల సైదులు, బొజ్జ చిన్నవెంకులు, రాచకొండ వెంకన్న, కె.మల్లేశం, కొండా అనురాధ, ఎండీ సలీం, పుచ్చకాయ నర్సిరెడ్డి, మల్ల మహేశ్, దండంపెల్లి సత్తయ్య పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలి : జాన్ వెస్లీ