Gajula Ramaram | మేం ఇక్కడనే చావాల్నా.. ? వాళ్ల ఆఫీసుల ముందుకెళ్లి చావాల్నా..? గాజుల రామారం బాధితుడు
Gajula Ramaram | రె మాకు తెలంగాణ ప్రభుత్వం నుండి పట్టా వచ్చింది. రిజిస్ట్రేషన్ కూడా చేయించిన. కోర్టు నుండి ఆదేశాలు ఇచ్చినా నా ఇంటిని కూల్చేశారని గాజులరామారం కూల్చివేతల బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Gajula Ramaram | రెవెన్యూ అధికారులు తమ ఇళ్లపై బుల్డోజర్లతో విరుచుకుపడటంపై గాజులరామారం కూల్చివేతల బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజులరామారంలో రెవెన్యూ అధికారులు పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను కూల్చివేయగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీలతో కొట్టారు. రెవెన్యూ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అన్ని అనుమతులున్నప్పటికీ తమ ఇండ్లను కూల్చివేయడంపై కన్నీరుమున్నీరవుతున్నారు.
మాకు తెలంగాణ ప్రభుత్వం నుండి పట్టా వచ్చింది. రిజిస్ట్రేషన్ కూడా చేయించిన. కోర్టు నుండి ఆదేశాలు ఇచ్చినా నా ఇంటిని కూల్చేశారని గాజులరామారం కూల్చివేతల బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మేం ఈ కాగితాలు కాకుండా ఇంకా ఏ కాగితాలున్నాయో మాకు చూపించండి. సార్ల కాళ్లు మొక్కి అవే తెచ్చుకుంటం. అన్ని కాగితాలున్నాయి. ఇక మా బతుకులు నిమ్మలంగా ఉంచుతరా.. పెట్రోల్ పోసుకుని చావమంటరా..? అని ఆగ్రహం వ్యక్తంచేశాడు. మా నాయన దివ్యాంగుడు. మమ్మల్ని ఇక్కడే కన్నడు. మేం ఇక్కడే పెరిగినం. మేం ఇక్కడనే చావాన్నా.. లేకపోతే వాళ్ల ఆఫీసుల ముందటికెళ్లి చావాల్నా..? నా ఇంటికొచ్చి రేకులు కూలగొట్టిర్రు. ఇంట్ల ఆడపిల్ల ఉంది.. కనీసం బాత్రూం కూడా కట్టుకోలేకుండా ఉంది పరిస్థితి… ఏం చేయాలే అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యాడు.
తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన పట్టా, రిజిస్ట్రేషన్, కోర్టు నుండి ఆదేశాలు ఇచ్చినా నా ఇంటిని కూల్చేశారు
మేము పెట్రోల్ పోసుకొని సచ్చే పరిస్థితి వచ్చింది
మా నాన్న వికలాంగుడు.. మమ్మల్ని ఇదే ఇంట్లో కన్నాడు. ఇప్పుడు ఈ ఇల్లును లేకుండా చేశారు
– గాజులరామారంలో పేదల ఇళ్లను కూల్చివేసిన… https://t.co/6F4fymDT4e pic.twitter.com/pV6ZoD4UK0
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2026
Read Also :
KTR | పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం : కేటీఆర్
Vinesh Phogat | వ్యవస్థ మొత్తం బ్రిజ్ భూషణ్నే కాపాడుతుంది: వినేశ్ ఫోగట్
Justice M.S. Liberhan: బాబ్రీ మసీదు ఎంక్వైరీ కమిషన్ హెడ్ జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ కన్నుమూత
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

