– గొట్టిపర్తి సర్పంచ్ చిరుకుల మంజుల వెంకన్న
తుంగతుర్తి, ఆగస్టు 03 : మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ సర్పంచ్ చిరుకుల మంజుల వెంకన్న అన్నారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవంలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మొక్కలు పచ్చగా ఉంటేనే గ్రామం పచ్చగా ఉంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లు, ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.