Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.. మమతా బెనర్జీ డిమాండ్
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఏఐటీసీ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఏఐటీసీ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అంతేకాదు.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేశ్వర్ కుమార్‌ను అరెస్టు చేయాలని మమత డిమాండ్ చేశారు. ప్రస్తుతం సర్ అంశంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం మమతా బెనర్జీ బుధవారం మీడియాతో మాట్లాడారు.
పశ్చిమ బెంగాల్‌ను దక్కించుకునేందుకు, టీఎంసీని ఓడించేందుకే కేంద్ర ప్రభుత్వం సర్ ప్రక్రియను ప్రారంభించందని మమత ఆరోపించారు. సర్ వల్లే బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఈ విషయంలో భారీ కుట్ర జరిగిందని అన్నారు. సర్‌కు ముందే బీజేపై ఐటీ సెల్ ఆఫీసర్ సీమా ఖన్నా రాష్ట్రంలో 58 లక్షల ఓట్లను తొలగించిందన్నారు. తర్వాత మరో 34 లక్షల ఓట్లను తొలగించినట్లు మమత చెప్పారు. సీఈసీ జ్ఞానేశ్వర్, బీజేపీ రెండూ జాయింట్ వెంచర్ కంపెనీలాంటి వారని, ఇద్దరూ కలిసి బీజేపీని బెంగాల్ ఎన్నికల్లో గెలిపించారని విమర్శించారు. ఇంకా ఏమైనా నైతిక విలువలు ఉంటే, బెంగాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మమత డిమాండ్ చేశారు.
సర్‌ను స్పెషల్ ఇన్సెంటివ్ ఫర్ రూలింగ్ పార్టీ అని అభివర్ణించారు. బీజేపీకి ఎన్నికల సంఘం రక్షణ కల్పించిందని, సీఈసీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్వర్‌కు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. సర్ ద్వారా బెంగాల్ నుంచి దాదాపు 10 శాతం.. అంటే, 79 లక్షల ఓట్లను తొలగించింది ఈసీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 293 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ ఏకంగా 207 సీట్లు గెలిచింది. టీఎంసీ 80 సీట్లకు పరిమితమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lung Health Problems | చలికాలంలో శ్వాసకోశ సమస్యల పట్ల జాగ్రత్త.. ఇలా చేస్తే ఇబ్బందులు ఉండవు..
KA Paul | రేవంత్ రెడ్డిది అవినీతి పాలన.. కనీసం ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వడం లేదు: కేఏ పాల్ ఫైర్
‘జలాల్పూర్ చెరువు కట్ట మూల మలుపు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి’
‘భద్రాచలం ఛాంబర్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలి’
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

