లక్నో: ఒక పోలీస్ అధికారి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని నేలపై విసిరేశాడు. ప్రతిఘటించిన ఆ మహిళ చెంపపై కొట్టాడు. (Cop Slaps Woman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి ఒక మహిళ స్థానిక ఆలయానికి వెళ్లింది. అక్కడ పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది.
కాగా, పోలీస్ అధికారి శివమ్ ఆ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆమె మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. దానిని నేలకు విసిరికొట్టాడు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆ మహిళ చెంపపై కొట్టాడు. ఆమె తన కాలర్ పట్టుకున్నదని, యూనిఫామ్ చించిందని ఆరోపించాడు.
మరోవైపు కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రతాప్‌గఢ్ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
प्रतापगढ़-महिला को सिपाही शिवम ने मारा थप्पड़, दर्शन करने आई महिला को मारा थप्पड़
महिला का फोन छीनकर जमीन पर पटका, नो पार्किंग जोन में गाड़ी खड़ी होने पर विवाद
मोबाइल तोड़ने पर महिला ने पकड़ा था कॉलर, वीडियो को संज्ञान में लेकर पुलिस जांच में जुटी, कुंडा थाना के मनगढ़ धाम के… pic.twitter.com/xly826bZSE
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) October 25, 2025
Also Read:
Tej Pratap Yadav | ఆర్జేడీలోకి తిరిగి రావడం కంటే సావటమే బెటర్ : తేజ్ ప్రతాప్ యాదవ్
Thief Runs Away With Cash Bag | టీ కోసం వేచి ఉన్న వ్యాపారి.. రూ.75 లక్షలున్న బ్యాగ్ చోరీ
Bengaluru Potholes | బెంగళూరులోని రోడ్లపై గుంతలకు.. మరో మహిళ బలి