బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని రోడ్లపై గుంతల కారణంగా మరో మహిళ బలి అయ్యింది. (Bengaluru Potholes) బైక్ నడుపుతున్న సోదరుడు సడన్గా బ్రేక్ వేశాడు. బైక్ వెనుక కూర్చొన్న అతడి సోదరి రోడ్డుపై పడింది. వేగంగా వచ్చిన లారీ ఆమె తలపై నుంచి వెళ్లడంతో మరణించింది. 26 ఏళ్ల ప్రియాంక కుమారి పూనియా బెంగళూరులోని బ్రిటన్కు చెందిన బ్యాంకులో పని చేస్తున్నది. సోదరుడు నరేష్ కుమార్ ఆమెను మాదవర మెట్రో స్టేషన్ వద్ద బైక్పై రోజూ దించేవాడు.
కాగా, శుక్రవారం ఉదయం ప్రియాంక కుమారి సోదరుడు నరేష్ బైక్పై బయలుదేరింది. రోడ్డుపై గుంత కారణంగా ముందు వెళ్తున్న కారు ఉన్నట్టుండి ఆగింది. దీంతో నరేష్ సడెన్గా బ్రేక్ వేశాడు. అయితే ఎదురుగా వచ్చిన లారీకి బైక్ హ్యాండిల్ తగిలింది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన నరేష్ ఎడమ వైపు పడ్డాడు. బైక్ వెనుక కూర్చొన్న ప్రియాంక కుడివైపు రోడ్డుపై పడింది. ఊహించని విధంగా ఆమె తలపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు ఉద్యోగిని ప్రియాంక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: రోడ్డుపై కత్తితో భార్యపై దాడి చేసిన భర్త.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హైవేను దిగ్బంధించిన ఏనుగు.. 18 గంటలు నిలిచిపోయిన వాహనాలు