తిరువనంతపురం: ఒక ఏనుగు హైవేను దిగ్బంధించింది. ఒక చెట్టును రోడ్డుకు అడ్డంగా పడేసింది. సుమారు 18 గంటల పాటు ఆ ఏనుగు అక్కడే ఉన్నది. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. (Elephant Blocks Highway) కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా అలజడి సృష్టించే ‘కబాలి’ ఏనుగు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అతిరప్పిల్లి-మలక్కప్పర అంతర్రాష్ట్ర రహదారిపైకి వచ్చింది. రోడ్డుకు అడ్డంగా ఒక చెట్టును పడేసి తినసాగింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆ ఏనుగును అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించారు. అయితే వారిపై అది దాడి చేయడంతో తృటిలో తప్పించుకున్నారు. చివరకు సోమవారం ఉదయం 7 గంటలకు ఆ ఏనుగు అడవిలోకి వెళ్లింది. దీంతో 18 గంటలపాటు ఆ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో వాహనాల్లో చిక్కుకుపోయిన వ్యక్తులు, టూరిస్టులు ఆహారం, నీరు లేక ఇబ్బందులకు గురయ్యారు.
మరోవైపు 2016లో రిలీజ్ అయిన రజనీకాంత్ చిత్రం ‘కబాలి’ పేరును ఈ ఏనుగుకు పెట్టారు.
దాని ప్రవర్తనతో ప్రసిద్ధి చెందిన ఇది గత ఏడాది అంబులెన్స్‌ను అడ్డుకున్నది. ఒక బైకర్‌ను గాయపర్చింది. 2022లో ఒక జీప్‌పై దాడి చేసింది. ఈ నేపథ్యంలో ‘కబాలి’ ఏనుగును అడవిలోకి తరమాలని స్థానికులు పలుమార్లు డిమాండ్ చేశారు. తాజాగా అది 18 గంటలపాటు రోడ్డును దిగ్బంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Kabali strikes again! On the Malakkappara road in Thrissur district, wild elephant “Kabali” blocked traffic, refusing to budge despite continuous honking. The incident caused a major 18-hour-long Trafic jam and the video is now going viral online. #Kerala pic.twitter.com/RJaxaFxbJw
— Ashish (@KP_Aashish) October 23, 2025
Also Read:
Elephant Dies | విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఏనుగు.. విద్యుదాఘాతంతో మృతి