చెన్నై: ఒక ఏనుగు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పడేసింది. విద్యుత్ వైరు తెగిపడటంతో విద్యుదాఘాతంతో అది మరణించింది. (Elephant Dies) ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఏనుగు మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల వయస్సున్న ఏనుగు అటవీ ప్రాంతం నుంచి బయటపడింది. గురువారం కుప్పేపాళయం సమీపంలోని రామన్ కుట్టైలో ఒక వ్యవసాయ భూమిలోకి అది ప్రవేశించింది.
కాగా, ఆ తోట వద్ద విద్యుత్ బోర్డు ఏర్పాటు చేసిన హై వోల్టేజ్ విద్యుత్ స్తంభాన్ని ఏనుగు ఢీకొట్టింది. దానిని కిందకు పడేసింది. ఈ నేపథ్యంలో లైవ్ విద్యుత్ వైరు తెగి పడింది. ఆ వైరు తగలడంతో విద్యుదాఘాతంతో ఏనుగు మరణించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది, పశువైద్యులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన ఏనుగుకు పోస్ట్మార్టం నిర్వహించారు. విద్యుదాఘాతం వల్ల అది మరణించినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ లైన్ నిర్వహణలో ఏమైన లోపం ఉన్నదా? అన్నది పరిశీలిస్తున్నారు.
Also Read:
Man Stabbed To Death | దీపావళి గిఫ్ట్ కోసం యజమానితో వ్యక్తి గొడవ.. కత్తితో పొడిచి హత్య
Watch: రైలు పట్టాలపై రీల్ చేసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?