ముంబై: ఒక షాపులో పని చేసే వ్యక్తి దీపావళి పండుగ నాడు బహుమతి ఆశించాడు. గిఫ్ట్ అందకపోవడంతో యజమానికి ఫోన్ చేసి తిట్టాడు. ఈ నేపథ్యంలో షాపు ఓనర్ మరి కొందరితో కలిసి అతడ్ని హత్య చేశాడు. (Man Stabbed To Death) మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల సుజిత్ గన్వీర్కు చెందిన తమలపాకుల దుకాణంలో 27 ఏళ్ల నితీశ్ ఠాక్రే పని చేస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా కొత్త బట్టలు లేదా ఏదైనా బహుమతిని యజమాని ఇస్తాడని ఆశించాడు. అయితే ఏమీ అందకపోవడంతో నితీశ్ తీవ్ర అంసంతృప్తి చెందాడు. దీంతో సుజిత్‌కు ఫోన్ చేసి అతడ్ని తిట్టాడు.
కాగా, నితీశ్ ప్రవర్తనపై షాపు యజమాని సుజిత్ ఆగ్రహించాడు. అతడ్ని హత్య చేసేందుకు కుట్రపన్నాడు. ఆన్లైన్లో కత్తి కొనుగోలు చేశాడు. సినిమాకు వెళ్దామని చెప్పి చంద్రపూర్‌లోని లా కాలేజీ వెనుకకు నితీశ్‌ను తీసుకెళ్లాడు. తన స్నేహితులైన ఐదుగురితో కలిసి అతడ్ని కొట్టడంతోపాటు కత్తితో పొడిచి చంపాడు.
మరోవైపు నితీశ్ హత్య గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. గంటలోనే నిందితులను గుర్తించారు. సుజిత్‌తో పాటు అతడి స్నేహితులైన కరణ్ మెష్రామ్ (22), యశ్ ఛోటేలాల్ రౌత్ (19), అనిల్ రామేశ్వర్ బోండే (22), ప్రతీక్ మాణిక్ మెష్రామ్ (22), తౌసిఫ్ షేక్ (23)ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Boy Kills Mother | గొడ్డలితో దాడి చేసి.. తల్లిని చంపిన బాలుడు
Girl Assaulted In Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్లో.. బాలికపై లైంగిక దాడి
Newborn Set To Lose Hand | తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన నర్సు.. చేయి కోల్పోనున్న నవజాత శిశువు