చండీగఢ్: తండ్రి నుంచి విడిపోయి వేరుగా నివసిస్తున్న తల్లిని ఆమె కుమారుడు హత్య చేశాడు. గొడ్డలితో దాడి చేసి చంపాడు. (Boy Kills Mother) కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆ బాలుడి కోసం వెతుకుతున్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల ముఖేష్ రాణి తన భర్త నుంచి విడాకులు పొందింది. లాడ్వా ప్రాంతంలోని ఇంట్లో వేరుగా నివసిస్తున్నది. ఆమె చిన్న కుమారుడు భర్తతో కలిసి ఉంటున్నాడు. పెద్ద కుమారుడు విదేశాల్లో నివసిస్తున్నాడు.
కాగా, 16 ఏళ్ల యువకుడైన చిన్న కుమారుడు మంగళవారం రాత్రి తన తల్లి ముఖేష్ రాణి ఇంటికి వెళ్లాడు. గొడ్డలితో ఆమె ముఖం, తలపై దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన రాణిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి హత్య తర్వాత పారిపోయిన కుమారుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ యువకుడు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు? ఇంట్లో గొడవలు, అతడి మానసిక పరిస్థితి వంటి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Girl Assaulted In Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్లో.. బాలికపై లైంగిక దాడి
Watch: తన కారుకు ఇంధనం నింపనందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపై అధికారి దాడి