కోల్‌కతా: ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్లో బాలికపై అత్యాచారం జరిగింది. గతంలో వార్డ్ బాయ్‌గా పని చేసిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. (Girl Assaulted In Hospital) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం 14 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి వెళ్లింది.
కాగా, ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ వద్ద టికెట్ కౌంటర్లో బాలిక తల్లిదండ్రులు వేచి ఉన్నారు. మాజీ వార్డ్ బాయ్ అమిత్ మల్లిక్ ఆ బాలికతో మాటలు కలిపాడు. ఆసుపత్రిలోని టాయిలెట్ వద్దకు ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. నిందితుడైన మాజీ వార్డ్ బాయ్ అమిత్ మల్లిక్‌ను బుధవారం రాత్రి ధాపాలో అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Children Lose Eyesight | దీపావళి రోజున ‘కార్బైడ్ గన్’తో ఆడిన పిల్లలు.. కంటి చూపు కోల్పోయిన 14 మంది
Watch: తన కారుకు ఇంధనం నింపనందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపై అధికారి దాడి
Watch: రైలు పట్టాలపై రీల్ చేసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?