చండీగఢ్: ఇంట్లో ఉంచిన బాణసంచా నుంచి మంటలు చెలరేగాయి. (Fireworks Catchs Fire) పటాకుల పేలుళ్లతో ఆ ఇల్లు మోతమోగింది. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో నివసించే పది మంది పిల్లలతో సహా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్‌లోని లూథియానాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఒక ఇంట్లో నిల్వ చేసిన ఫైర్‌క్రాకర్స్ నుంచి అకస్మాత్తుగా మంటలు రాజుకున్నాయి. ఆ టపాకాయలు పేలడంతో అక్కడ గందరగోళం నెలకొన్నది. ఆ ఇంట్లో నివసించే పది మంది పిల్లలతో సహా 24 మందికి కాలిన గాయాలయ్యాయి.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆరుకు పైగా ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. తీవ్రంగా కాలిన గాయాలైన పిల్లలు, పెద్దలను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Children Lose Eyesight | దీపావళి రోజున ‘కార్బైడ్ గన్’తో ఆడిన పిల్లలు.. కంటి చూపు కోల్పోయిన 14 మంది
Watch: రైలు పట్టాలపై రీల్ చేసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Sisters Marry Multiple Men | పలువురిని పెళ్లాడిన అక్కాచెల్లెళ్లు.. ఆ తర్వాత డబ్బు, నగలతో పరార్