Vladimir Putin | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖమేనికి కంగ్రాట్స్ చెప్పిన పుతిన్.. ఇరాన్‌కు అండగా ఉంటామని హామీ
Vladimir Putin : ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన అయతొల్లా మొజ్తాబా ఖమేనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. ఇరాన్‌కు మద్దతుగా ఉంటామని పుతిన్ హామీ ఇచ్చారు.
Vladimir Putin : ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన అయతొల్లా మొజ్తాబా ఖమేనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. ఇరాన్‌కు మద్దతుగా ఉంటామని పుతిన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం పుతిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మొజ్తాబాకు శుభాకాంక్షలు. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్‌కు రష్యా అండగా నిలబడుతుంది. ఇరాన్‌లోని మా స్నేహితులకు, వారి సమగ్రతకు రష్యా మద్దతుగా ఉంటుంది. మొజ్తాబా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఇరాన్ ప్రజల్ని ఏకతాటిపైకి తెస్తారని భావిస్తున్నాం. యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో నాయకత్వం వహించడానికి మొజ్తాబాకు గొప్ప ధైర్యం, పట్టుదల కావాలి’’ అని పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు.
ఒకవైపు మొజ్తాబా ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, రష్యా మాత్రం మద్దతుగా నిలవడం విశేషం. ఈ యుద్ధ సమయంలో ఇరాన్‌కు రష్యా నైతిక మద్దతు ప్రకటించింది. ఇటీవలే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. దాడుల్లో మరణించిన ఖమేనీ, అతడి కుటుంబ సభ్యులు, ఇరాన్ ప్రజలు, సైనికులకు పుతిన్ సంతాపం తెలిపారు. దీనికి మసౌద్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను అక్కడి అసెంబ్లీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. 1969లో జన్మించిన మొజ్తాబా ఇరాన్‌లోనే మత గురువుల వద్ద విద్యనభ్యసించారు.
తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మొజ్తాబా తండ్రి, ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతొల్లా ఖమేని, తల్లి, అతడి భార్య కూడా మరణించారు. మొజ్తాబా ఎన్నికతో అతడి మద్దతుదారులు ఇరాన్లో సంబరాలు చేసుకుంటున్నారు. కాగా.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సహకరిస్తోందనే ఆరోపణలున్నాయి. దీనిపై అమెరికా కూడా ఆరోపణలు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలి’
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Nora Fatehi | నోరా ఫతేహికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
Samantha | తొమ్మిదో నెలలోనూ సమంత వర్కౌట్స్.. ‘ఫైనల్ ల్యాప్’ అంటూ ఆసక్తికర పోస్ట్!
Health tips | రాత్రి ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

