లక్నో: నవజాత శిశువుకు ఒక నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో చేయి ఉబ్బడంతోపాటు నీలం రంగులోకి మారింది. ఈ నేపథ్యంలో ఆ శిశువు చేతిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. (Newborn Set To Lose Hand) ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 5న పండంటి ఆడ బిడ్డకు ఒక మహిళ జన్మనిచ్చింది. ఆ పసిపాప ఆరోగ్యం క్షీణించడంతో ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో అడ్మిట్ చేశారు.
కాగా, ఆ హాస్పిటల్‌లోని నర్సు నవజాత శిశువుకు తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో ఆ బిడ్డ చేయి ఉబ్బడంతోపాటు వేళ్లు నీలం రంగులోకి మారాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో ఆ శిశువును మరో రెండు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అయితే తీవ్ర ఇన్ఫెక్షన్ సోకి కుళ్లిన శిశువు చేతిని తొలగించాల్సి ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
మరోవైపు నవజాత శిశువు తండ్రి బాలేశ్వర్ భాటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిర్లక్ష్యం వహించిన ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో గౌతమ్ బుద్ధ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు పోలీస్ అధికారి లేఖ రాశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని కోరారు.
Also Read:
Girl Assaulted In Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్లో.. బాలికపై లైంగిక దాడి
Children Lose Eyesight | దీపావళి రోజున ‘కార్బైడ్ గన్’తో ఆడిన పిల్లలు.. కంటి చూపు కోల్పోయిన 14 మంది
Boy Kills Mother | గొడ్డలితో దాడి చేసి.. తల్లిని చంపిన బాలుడు
Watch: తన కారుకు ఇంధనం నింపనందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపై అధికారి దాడి