ముంబై: ప్రియురాలికి మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని ప్రియుడు అనుమానించాడు. బ్రేకప్ తర్వాత చివరిసారి కలిసిన అతడు ఆ మహిళను కత్తితో పొడిచాడు. ఆ తర్వాత తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. అయితే ఆ వ్యక్తి మరణించగా, గాయపడిన ఆమె ప్రాణాలు దక్కించుకున్నది. (Man Stabs Girlfriend, Himself) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల సోను బరాయ్, మనీషా యాదవ్ ప్రేమించుకున్నారు. అయితే ప్రియురాలికి మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని సోను అనుమానించాడు. ఈ నేపథ్యంలో 8 రోజుల కిందట వారిద్దరూ విడిపోయారు.
కాగా, శుక్రవారం ఉదయం మనీషాకు సోను ఫోన్ చేశాడు. నర్సింగ్ హోమ్ వద్ద చివరిసారి కలుద్దామని చెప్పాడు. బయటకు వెళ్తున్నానని తల్లితో అన్నాడు. వంటగదిలోని కత్తిని వెంట తీసుకెళ్లాడు.
మరోవైపు కలుసుకున్న తర్వాత సోను, మనీషా మధ్య గొడవ జరిగింది. దీంతో వెంటతెచ్చిన కత్తితో ఆమెను సోను పొడిచాడు. ఆ తర్వాత అదే కత్తితో తనను తాను పొడుకున్నాడు. నర్సింగ్ హోమ్ ప్రవేశ ద్వారం వద్ద రక్తంమడుగులో పడి మరణించాడు.
అయితే కత్తి పోటువల్ల గాయపడిన మనీషా ప్రాణాలతో బయటపడింది. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
24-Year-Old Woman Attacked Over Love Affair in Mumbai’s Kalachowki; Assailant Found Deceased.#mumbai #mumbainews #kalachowki pic.twitter.com/7WTy0liRoj
— Free Press Journal (@fpjindia) October 24, 2025
Also Read:
Man Stabbed To Death | దీపావళి గిఫ్ట్ కోసం యజమానితో వ్యక్తి గొడవ.. కత్తితో పొడిచి హత్య
Girl Assaulted In Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్లో.. బాలికపై లైంగిక దాడి
‘fake’ wife twist | రాజస్థాన్ అధికారి చెంపదెబ్బ వివాదంలో.. నకిలీ భార్య ట్విస్ట్