జైపూర్: తన కారుకు వెంటనే ఇంధనం నింపనందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఆగ్రహించాడు. పెట్రోల్ బంకు సిబ్బంది చెంపపై కొట్టాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణపై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె నకిలీ భార్య అన్నది వెలుగులోకి వచ్చింది. (‘fake’ wife twist) రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రతాప్‌గఢ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఛోటు లాల్ శర్మ, మంగళవారం జస్వంత్పురా ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌కు తన కారులో చేరుకున్నాడు. క్యూలో ఉన్న మిగతా వాహనాల కంటే ముందుగా తన కారుకు ఇంధనం నింపకపోవడంపై ఆయన ఆగ్రహించాడు. ఒక సిబ్బంది వద్దకు వెళ్లి చెంపపై కొట్టాడు. దీంతో పెట్రోల్ బంకు సిబ్బంది ఆయనపై చేయి చేసుకున్నారు.
కాగా, ఆ కారులో ఉన్న దీపికా వ్యాస్ ఆయన భార్యగా పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెట్రోల్ బంకులోని ఒక సిబ్బంది తనను చూసి కన్నుగీటి అసభ్యకరమైన వ్యాఖ్య చేసినట్లు ఆరోపించింది. దీంతో తన భర్త అయిన ఎస్డీఎం జోక్యం చేసుకోవడంతో ఈ గొడవ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, దీపక్ మాలి, ప్రభు లాల్ కుమావత్, రాజా శర్మ అనే ముగ్గురు బంకు సిబ్బందిని అరెస్ట్ చేశారు.
మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేసిన దీపికా వ్యాస్, ఎస్డీఎం ఛోటు లాల్ శర్మ చట్టబద్ధమైన భార్య కాదని బయటపడింది. అసలు భార్య పూనమ్ శర్మ, పిల్లలను ఆ అధికారి ఇంటి నుంచి వెళ్లగొట్టినట్లు తెలిసింది. తన పిల్లలతో కలిసి విడిగా నివసిస్తున్న పూనమ్ తన భర్తపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె జీవనోపాధి కోసం కష్టపడుతున్నది.
కాగా, ఎస్డీఎం ఛోటు లాల్ శర్మ మొదట అకారణంగా పెట్రోల్ బంకు సిబ్బంది చెంపపై కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన నకిలీ భార్య ఫిర్యాదుతో కేవలం బంకు సిబ్బందిని అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దిగి వచ్చారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
అయితే తాజా సంఘటన నేపథ్యంలో ఛోటు లాల్ శర్మ వివాదాస్పద గతం వెలుగులోకి వచ్చింది. భిల్వారా జిల్లాలో ఎస్డీఎంగా పని చేస్తున్న ఆయన తన వైఖరి కారణంగా గతంలో మూడుసార్లు సస్పెండ్ అయ్యారు.
SDM साहब ने तो महिला विक्टिम कार्ड खेल दिया बेचारा पेट्रोल पम्प का कर्मचारी….
कर्मचारी से सम्पर्क करवाये मै कानूनी साहयता करूंगी एक गरीब कि जोकि बेकसूर है 🙏 pic.twitter.com/td9D8TLNFP
— कल्पना श्रीवास्तव 🇮🇳 (@Lawyer_Kalpana) October 22, 2025
Also Read:
Newborn Set To Lose Hand | తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన నర్సు.. చేయి కోల్పోనున్న నవజాత శిశువు
Boy Kills Mother | గొడ్డలితో దాడి చేసి.. తల్లిని చంపిన బాలుడు
Girl Assaulted In Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్లో.. బాలికపై లైంగిక దాడి
Watch: రైలు పట్టాలపై రీల్ చేసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?