రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం అందజేశారు.
రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, జీపీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్లోనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం నిధులు కేటాయించాలని కోరుతూ చర్చ పెట్టాలని కోరారు.
వాయిదా తీర్మానం ఇచ్చిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనిల్ జాదవ్, విజేయుడు ఉన్నారు.

Brs Adjournment Motion