లక్నో: ఒక వ్యక్తికి మరో వ్యక్తితో అసహజ లైంగిక సంబంధం ఏర్పడింది. అతడి కూతురుపై గే పార్ట్నర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగ్రహించిన ఆ వ్యక్తి అతడి ప్రైవేట్ భాగాన్ని నరికాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Man Chops Off Gay Partner’s Genitals) ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల వ్యక్తి స్థానిక ఆర్కెస్ట్రా గ్రూపులో కళాకారుడు. భార్య నుంచి విడిపోయిన అతడు స్నేహితుడైన 35 ఏళ్ల రాంబాబు యాదవ్‌తో కలిసి అద్దె గదిలో నివసిస్తున్నాడు. వీరిద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది.
కాగా, భార్య వద్ద ఉంటున్న ఆరేళ్ల కుమార్తె అప్పుడప్పుడు తండ్రిని కలిసేందుకు అక్కడకు వచ్చేది. గురువారం ఆ ఇంటికి వచ్చిన ఆ బాలికపై రాంబాబు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి తన గే పార్ట్‌నర్‌పై ఆగ్రహించాడు. రాంబాబు ప్రైవేట్ భాగాన్ని కత్తిరించాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని తొలుత డియోరియా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు బాలిక తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో రాంబాబుపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆ వ్యక్తితో తనకు ఉన్న సంబంధం గురించి రాంబాబు వెల్లడించాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున బాలిక తండ్రి ఇంట్లో మరణించాడు. అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Man Stabbed To Death | దీపావళి గిఫ్ట్ కోసం యజమానితో వ్యక్తి గొడవ.. కత్తితో పొడిచి హత్య
Elephant Dies | విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఏనుగు.. విద్యుదాఘాతంతో మృతి