Arrest | యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో భర్త అరెస్ట్.. అదనపు కట్నం కోసమే దారుణం : డీఎస్పీ
Arrest | యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రేమించి పెళ్లాడిన భర్త భార్యను అదనపు కట్నం కోసమే హత్య చేశాడని పోలీసులు నిర్దారించారు.
కోరుట్ల : యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రేమించి పెళ్లాడిన భర్త భార్యను అదనపు కట్నం కోసమే హత్య ( Murder ) చేశాడని పోలీసులు నిర్దారించారు. హత్యకు సంబంధించిన వివరాలను కోరుట్ల పట్టణంలోని పోలీస్టేషన్లో మెట్పల్లి డీఎస్పీ రాములు( DSP Ramulu ) , కోరుట్ల సీఐ బుధవారం వెల్లడించారు.
కోరుట్ల మండలంలోని మాదాపూర్కు చెందిన గంధం దుర్గా ప్రసాద్, రాణి దంపతుల కూతురు వైష్ణవి( Vaishnavi -20 ) కొంతకాలంగా యూట్యూబ్ ( You tube ) ద్వారా వీడియోలు రూపొందిస్తూ పేరు తెచ్చుకుంది. 10 నెలల క్రితం కోరుట్లలోని ఏస్కోనిగుట్ట కాలనీకి చెందిన చిత్తరి హరిబాబుతో స్నేహం కుదిరి అది కాస్తా ప్రేమగా మారింది. హరిబాబు తల్లిదండ్రులు వివాహ విషయమై మాట్లాడేందుకు వచ్చి కట్న కానుకలు ఇవ్వాలని కోరగా, వైష్ణవి తల్లిదండ్రులు కట్నం ఇవ్వలేని స్థితిలో ఉన్నామని తెలిపారు.
కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని హరిబాబు తల్లి ఒత్తిడి తేవడంతో గతంలో హరిబాబు విషం సేవించి ఆత్మహత్యయత్నం చేశాడు. హరిబాబు కోలుకొని వైష్ణవిని పెళ్లి చేసుకుంటానని ఇరు కుటుంబాలను నచ్చజెప్పినా వినకపోవడంతో పెద్దలను ఎదిరించి 2025 మే 29న వెంకటాపూర్ గ్రామశివారులో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మాదాపూర్లోని దంపతులు అత్తవారింటిలోనే ఉంటున్నారు.
కొద్ది రోజుల తర్వాత హరిబాబు కట్నం విషయం ప్రస్తావించగా వైష్ణవి తల్లిదండ్రులు రూ. 5 లక్షలు కట్నం రూపంలో రెండు గుంటల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు. కొద్దిరోజులుగా అదనంగా మరో రూ.5 లక్షలు కట్నం తేవాలని హరిబాబు, తల్లి లక్ష్మీ, అన్నలు ఆనంద్, అశోక్ తోడై భార్య వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించాడని పోలీసులు తెలిపారు. ఈ దశలో వైష్ణవి నాలుగు నెలల గర్భం దాల్చినా వరకట్న వేధింపులు ఆగలేదు.
ఈ నెల 17న వైష్ణవిని భర్త హరిబాబు చంపి పరారయ్యాడు. వైష్ణవి గదిని తల్లిదండ్రులు తెరిచి చూడగా, కూతురు మంచం పక్కన రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి ఆమెను కోరుట్లలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ప్రకటించారు. వైష్ణవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కోనారావుపేట ఎక్స్ రోడ్డు వద్ద నిందితుడిని పట్టుకొని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. మీడియా సమావేశంలో ఎస్సై చిరంజీవి, పోలీస్ సిబ్బంది, తదితరులున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

