బెంగళూరు: రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక వ్యక్తి కత్తితో భార్యపై దాడి చేశాడు. అక్కడి నుంచి పారిపోతున్న అతడ్ని కర్రతో మరో వ్యక్తి కొట్టాడు. దీంతో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. (Man Attacks Wife With Machete) అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడిన భార్యాభర్తలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సిందగిలోని రద్దీ రోడ్డులో 60 ఏళ్ల యమనప్ప మదర్ తన భార్య అయిన 50 ఏళ్ల అనసుయతో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో ముఖానికి చేతిరూమాలు కట్టుకున్న అతడు చేతిలోని కత్తితో భార్య వెంటపడ్డాడు. కత్తితో పలుమార్లు దాడి చేశాడు. దీంతో ఆమె గాయాలతో రోడ్డుపై పడిపోయింది.
కాగా, భార్యపై దాడి చేసిన యమనప్ప అక్కడున్న వారిని కత్తితో బెదిరించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నడిచి వెళ్తుండగా ఒక వ్యక్తి పెద్ద మొద్దుతో దాడి చేశాడు. దీంతో ఆ వృద్ధుడు రోడ్డుపై కుప్పకూలిపోయాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయాలతో రోడ్డుపై పడి ఉన్న యమనప్ప, అతడి భార్య అనసూయను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ దాడి ఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Graphics:A man attacked his wife with machete in #Sindagi after a quarrel.Locals beat the accused,Yamanappa (60),who is now under police custody.Both he & his wife,Anusuya,were injured bt are stable in hospital.The motive will be confirmed after their statements.@VIJAYAPURPOLICE pic.twitter.com/7fS0VolN4Z
— Yasir Mushtaq (@path2shah) October 24, 2025
Also Read:
Watch: హైవేను దిగ్బంధించిన ఏనుగు.. 18 గంటలు నిలిచిపోయిన వాహనాలు