లక్నో: ఒక మహిళకు ఆడపిల్ల పుట్టింది. గర్భం దాల్చగా లింగ పరీక్ష ద్వారా ఆడ బిడ్డగా తెలుసుకుని రెండుసార్లు అబార్షన్ చేయించారు. మగ బిడ్డ కోసం మామ, మరిదితో పడుకోవాలని ఒత్తిడి చేశారు. (Woman Made To Abort Twice) అదనపు కట్నం కోసం వేధించి హింసించడంతోపాటు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. 2021లో మెహక్ ఖాన్కు షా ఫహీద్తో వివాహం జరిగింది. కొన్ని నెలల తర్వాత అదనపు కట్నం, కారు కోసం భర్త, అతడి కుటుంబం డిమాండ్ చేసింది. వాటి కోసం రోజూ ఆమెను కొట్టి హింసించసాగారు.
కాగా, మెహక్ ఖాన్ తొలికాన్పులో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అత్తింటి వారి వేధింపులు మరింత పెరిగాయి. ఆమె మళ్లీ గర్భం దాల్చగా లింగ నిర్ధారణ పరీక్ష ద్వారా ఆడ శిశువు అని తెలుసుకున్నారు. ఇలా రెండు సార్లు అబార్షన్ చేయించారు. మగ బిడ్డ కోసం మామ, మరిదితో పడుకోవాలని అత్త, ఆమె కూతుకు ఒత్తిడి చేశారు. మామ, మరిది కూడా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. భర్తకు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది.
మరోవైపు కొన్ని రోజుల కిందట మెహక్ ఖాన్, ఆమె కుమార్తెను అత్తింటి వారు దారుణంగా కొట్టారు. వారిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అదనపు కట్నం, కారు తెచ్చేవరకు తమ ఇంటికి రావద్దని చెప్పారు. ఈ నేపథ్యంలో మెహక్ ఖాన్ తన అత్తింటి కుటుంబంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త, అత్త, మామ, వారి కుమార్తె, కొడుకుతో సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: హైవేను దిగ్బంధించిన ఏనుగు.. 18 గంటలు నిలిచిపోయిన వాహనాలు