తిరువనంతపురం: ఒక వ్యాపారి టీ తాగేందుకు వేచి ఉన్నాడు. అయితే ఆయనకు చెందిన రూ.75 లక్షలు ఉన్న బ్యాగును ఒక వ్యక్తి ఎత్తుకెళ్లాడు. (Thief Runs Away With Cash Bag) గమనించిన ఆ వ్యాపారి అతడి వెంట పరుగెత్తినప్పటికీ ఫలితం లేకపోయింది. కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఎడప్పల్కు చెందిన 53 ఏళ్ల వ్యాపారవేత్త ముబారక్ శనివారం బెంగళూరు నుంచి తిరిగి వచ్చాడు. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో మన్నుతి బైపాస్‌లో బస్సు దిగాడు. టీ తాగేందుకు టీస్టాల్ వద్దకు చేరుకున్నాడు. టీ కోసం వేచి ఉన్న ఆయన రూ.75 లక్షలు ఉన్న బ్యాగును మెడికల్ షాపు ముందు నేలపై ఉంచాడు.
కాగా, ఒక వ్యక్తి అక్కడకు చేరుకున్నాడు. ముబారక్‌కు చెందిన డబ్బుల బ్యాగ్‌ను తీసుకుని అక్కడి నుంచి పరుగెత్తాడు. గమనించిన వ్యాపారి ఇది చూసి షాక్ అయ్యాడు. తేరుకున్న అతడు ఆ వ్యక్తి వెంట పరుగెత్తాడు. ఆ దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే ముబారక్‌ను ఆ వ్యక్తి తోయడంతో కిందపడి గాయపడ్డాడు. తన గ్యాంగ్ ఉన్న కారులోకి ఆ దొంగ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్వల్పంగా గాయపడిన వ్యాపారి ముబారక్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Tej Pratap Yadav | ఆర్జేడీలోకి తిరిగి రావడం కంటే సావటమే బెటర్ : తేజ్ ప్రతాప్ యాదవ్
Bengaluru Potholes | బెంగళూరులోని రోడ్లపై గుంతలకు.. మరో మహిళ బలి
Watch: హైవేను దిగ్బంధించిన ఏనుగు.. 18 గంటలు నిలిచిపోయిన వాహనాలు