పాట్నా: బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీలోకి తిరిగి రావడం కంటే మరణాన్నే ఎంచుకుంటానని అన్నారు. పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ యాదవ్ జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించారు. 2015లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహువా స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.
కాగా, శుక్రవారం పీటీఐకి తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆర్జేడీకి తిరిగి వెళ్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. ‘ఆ పార్టీకి తిరిగి రావడం కంటే నేను మరణాన్ని ఎంచుకుంటా. అధికారం చేపట్టాలన్న ఆకలి నాకు లేదు. నైతిక సూత్రాలు, ఆత్మగౌరవం నాకు అత్యున్నతమైనవి’ అని అన్నారు.
మరోవైపు తమ్ముడు తేజస్వి యాదవ్‌ను ఇండియా బ్లాక్ సీఎం అభ్యర్థిగా పేర్కొనడంపై తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. అధికార పీఠం దక్కించుకునేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరమని అన్నారు. ‘ప్రజల కోసం పనిచేయడమే నాకు అతి పెద్ద విషయం. నేను హృదయపూర్వకంగా అలా చేస్తా. ప్రజలు నన్ను ప్రేమిస్తారు, విశ్వసిస్తారు’ అని అన్నారు.
मर जाऊंगा लेकिन वापस RJD में नहीं जाऊंगा- तेज प्रताप यादव
सोचिए
– लालू कैसे पिता रहे होंगे
– राबड़ी जी कैसी मां रही होंगी
– तेजस्वी जी कैसे भाई रहेंगेकि उनसे Tej Pratap Yadav का इतना दिल दुखा है कि बंदा मरने को तैयार है लेकिन RJD में वापसी को तैयार नहीं है ?
आख़िर तेजू भैया… pic.twitter.com/rQLLXdEbwQ
— Abhay Pratap Singh (बहुत सरल हूं) (@IAbhay_Pratap) October 24, 2025
Also Read:
Bengaluru Potholes | బెంగళూరులోని రోడ్లపై గుంతలకు.. మరో మహిళ బలి
Watch: రోడ్డుపై కత్తితో భార్యపై దాడి చేసిన భర్త.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హైవేను దిగ్బంధించిన ఏనుగు.. 18 గంటలు నిలిచిపోయిన వాహనాలు