భోపాల్: ఫామ్‌హౌస్‌లో గుట్టుగా ఆయుధాలు తయారు చేస్తున్నారు. గన్స్‌తో దొరికిన ఒక వ్యక్తి ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో అక్రమ ఆయుధ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. పలు పిస్టల్స్తోపాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. (Cops Raid Illegal Arms Factory) మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 21న అమల్హరి గ్రామ కూడలి సమీపంలో ఒక వ్యక్తి అక్రమంగా పిస్టల్స్ అమ్మేందుకు వేచి ఉన్నట్లు బరోహి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్కు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతడ్ని అరెస్ట్ చేశారు. 32-బోర్ పిస్టల్ ఒకటి, మూడు 315-బోర్ పిస్టల్స్, మూడు లైవ్ కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఆ వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. దీంతో రూపవైలోని ఒక ఫామ్‌హౌస్‌ను నెలకు రూ.20,000 చొప్పున అద్దెకు తీసుకుని అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్నట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు రైడ్ చేశారు. 12 దేశీయ పిస్టల్స్, మూడు లైవ్ కార్ట్రిడ్జ్లు, ఆయుధ తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిఫుణులైన సిబ్బందిని నియమించుకుని వారికి నెలకు రూ.50,000 చొప్పున చెల్లిస్తూ ఈ తుపాకీ ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇది తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. పిస్టల్స్‌ను అసెంబుల్ చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అయితే సెప్టెంబర్ 19 నుంచి ఈ ఫామ్‌హౌస్‌లో అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 22 పిస్టళ్లను తయారు చేశారు. ఇందులో ఏడు పిస్టల్స్‌ను అమ్మారు. వీటిని కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరి సమాచారం సేకరించారు. ప్రధాన నిందితుడైన పేరుమోసిన నేరస్తుడు పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడ్ని పట్టుకోవడం కోసం రూ. 10,000 రివార్డు ప్రకటించారు.
Also Read:
Tej Pratap Yadav | ఆర్జేడీలోకి తిరిగి రావడం కంటే సావటమే బెటర్ : తేజ్ ప్రతాప్ యాదవ్
Thief Runs Away With Cash Bag | టీ కోసం వేచి ఉన్న వ్యాపారి.. రూ.75 లక్షలున్న బ్యాగ్ చోరీ
Bengaluru Potholes | బెంగళూరులోని రోడ్లపై గుంతలకు.. మరో మహిళ బలి
Watch: మహిళ మొబైల్ ఫోన్ నేలకు విసిరికొట్టి.. ఆమె చెంపపై కొట్టిన పోలీస్