అబిడ్స్, మార్చి 11: కుళ్లి పోయిన గొర్రెలు, మేకల విడి భాగాలను సేకరించి నిల్వ చేసిన ఓ మాంసం వ్యాపార కేంద్రంపై మంగళ్‌హాట్ పోలీసులు దాడులు నిర్వహించి ఒకరిని అరెస్ట్ చేసి.. 300 కిలోల కుళ్లిపోయిన గొర్రె, మేకల విడి భాగాలను సీజ్ చేశారు. ఈ మేరకు మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోషామహల్ ఏసీపీ సుదర్శన్, మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ రా ఘవేంద్రతో కలిసి గోల్కొండ జోన్ అదనపు డీసీపీ కృష్ణగౌడ్ వివరాలను వెల్లడించారు. మంగళ్‌హాట్ కిస్తీ చమాన్‌లో ఎండీ అఫ్రోజ్ (41) ఏ టు జెడ్ షీప్ అండ్ గోట్ అఫల్స్ దు కాణంలో మేక, గొర్రెలకు చెందిన విడి భాగాలు ఉన్నాయి.
దీనిపై సమాచారం అందుకున్న మంగళ్‌హాట్ పోలీసులు, గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా దాడులు నిర్వహించి 300 కిలోల కుళ్లిన మేక, గొర్రెల విడి భాగాలను స్వాధీనం చేసుకుని, అఫ్రోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అఫ్రోజ్‌ను విచారించగా కర్నాటక, ఢిల్లీ, జమ్మూ, కాశ్మీర్ రాష్ర్టాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి డీప్ ఫ్రీజర్లలో నిల్వచేసి ఉంచినట్లు తెలిపారు. ఈ మేరకు మంగళ్‌హా ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని జీహెచ్ఎంసీ ఆహార కల్తీ విభాగం అధికారులకు అందజేశారు. పెద్ద ఎత్తున నిల్వ చేసిన ఈ మాంసం విడి భాగాలను శుభకార్యాలు, హోటళ్లకు పెద్ద మొత్తంలో సరఫరా చేస్తున్నాడని తెలిపారు. నిందితుడు గతంలో ఇదే మాదిరిగా కుళ్లి పోయిన మాంసం నిల్వలు ఉంచి పట్టుబడ్డారన్నారు.