Ego Raja | శంబాల సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ యంగ్ యాక్టర్ ఆది సాయికుమార్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన ఆదిసాయికుమార్ గురు శరవణన్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈగో రాజా (Ego Raja)టైటిల్‌తో వస్తోన్న ఈ మూవీని ఎస్జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జీ సురేశ్ నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్ తమిళ్ డెబ్యూ సినిమాగా వస్తోన్న ఈగో రాజా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సతీశ్ కీ రోల్లో నటిస్తున్నాడు.
ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ కొత్త లుక్ విడుదల చేశారు. ఆదిసాయికుమార్ చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తపు మరకలు చూస్తుంటే హై ఓల్టేజీ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఆది నిప్పు రాజేసేలా యాక్షన్ అవతార్‌లో ఇప్పటివరకు లేని విధంగా సిగరెట్ కాలుస్తూ అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆదిలో ఇదివరకెన్నడూ చూడని డైమెన్షన్‌ను చూడబోతున్నారని తాజా లుక్‌తో హింట్ ఇచ్చేస్తున్నారు మేకర్స్.
పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దగ్గర పనిచేసిన గురు శరవణన్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడం, బైలింగ్యువల్ ప్రాజెక్టు అవడంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. హై ఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్ అందిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
The fire has been lit, and #Aadi is in his most aggressive, action-charged avatar yet 🔥
The shoot of Telugu-Tamil Bilingual #EgoRaja is in full swing
Expect raw power, solid attitude, and a never-seen-before dimension from #AadiSaiKumar
Team Ego Raja wishes everyone a vibrant… pic.twitter.com/pIGIFJjHI7
— Sai Satish (@PROSaiSatish) March 19, 2026
PM Modi | తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, గవర్నర్
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రివ్యూ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎలా ఉంది.!