Uttar Pradesh | ఫేస్బుక్లో ‘సిమెంట్ అండ్ డ్రమ్’ అంటూ పోస్ట్ చేసిన మహిళ.. భయంతో భార్యను లవర్ దగ్గరకు పంపించిన భర్త
Uttar Pradesh : చాలా మంది బ్లూ డ్రమ్ అన్నా, సిమెంట్ అన్నా భయపడిపోతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఒక భర్త ఇలాగే భయపడ్డాడు. పైగా అతడి భార్య ఫేస్బుక్లో బ్లూ డ్రమ్, సిమెంట్ అంటూ పోస్ట్ చేసింది.
Uttar Pradesh : బ్లూ డ్రమ్, సిమెంట్ అంటే చాలు కొందరు పెళ్లైన మగాళ్లు భయంతో వణికిపోతున్నారు. గత ఏడాది ముస్కాన్ రస్తోగి ఒక మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, అడ్డుగా ఉన్న భర్తను చంపింది. అతడి బాడీని తన లవర్‌తో కలిసి ముక్కలుగా నరికి బ్లూ డ్రమ్‌లో ఉంచి, ఆపై సిమెంట్ పోసింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పట్నుంచి చాలా మంది బ్లూ డ్రమ్ అన్నా, సిమెంట్ అన్నా భయపడిపోతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఒక భర్త ఇలాగే భయపడ్డాడు. పైగా అతడి భార్య ఫేస్బుక్లో బ్లూ డ్రమ్, సిమెంట్ అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు.. ఆమెకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.
ఈ ఘటనకు సంబంధించి యూపీలోని, బులంద్షర్ ప్రాంతానికి చెందిన భర్త రాజ్ కుమార్ చెప్పిన వివరాలివి. రాజ్ కుమార్‌కు ఒక మహిళతో కొంతకాలం క్రితం పెళ్లైంది. వారికి ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే, ఆమెకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. అంతేకాదు.. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలున్నాయా అంటూ భర్తనే ఎదురు ప్రశ్నించేది. గత ఏడాది జూలైలో బాబును, భర్తను ఇంట్లోనే వదిలేసి తన పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. అయితే, ఆమె పుట్టింటికి వెళ్లలేదు. లవర్‌తో కలిసి ఉండటానికి వెళ్లింది. అలా నెల రోజులు అతడితోనే ఉంది. ఈ విషయంపై కూడా ఆధారాలు చూపించాలని అడిగేది. అంతేకాదు.. తనకు అడ్డొస్తే భర్తతోపాటు అతడి సోదరుల్ని కూడా చంపుతానంటూ బెదిరించేది.
ఈ క్రమంలో ఒకరోజు ఆమె తన లవర్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా పట్టుకున్నాడు. అలాగే ఆమె ఫోన్ పరిశీలించగా, తన ఫేస్బుక్ అకౌంట్లో షాకింగ్ విషయం చూశాడు. మర్డర్ చేయడం గురించి, బ్లూ డ్రమ్, సిమెంట్ అంటూ ఆమె చేసిన పోస్టులు చూశాడు. దీంతో భర్త రాజ్ కుమార్‌కు విషయం అర్థమైంది. తన భార్య అప్పటికే తనను చంపుతానని బెదిరించడం, వేరొక వ్యక్తితో సంబంధం ఉండటం, బ్లూ డ్రమ్, సిమెంట్ గురించి ఆలోచించడం.. వీటన్నింటినీ కలిపి చూసిన భర్త భయాందోళనకు గురయ్యాడు. ఈ విషయంలో భార్యను అర్థం చేసుకోకపోతే తనను చంపేస్తుందేమో అని భావించాడు. చివరకు తనతో ఉంటావా, లేక లవర్‌తో ఉంటావా అని భార్యను నేరుగా అడిగేశాడు. దీనికి ఆమె తన లవర్‌తోనే ఉంటానని స్పష్టం చేసింది. తర్వాత ఈ అంశంపై రాజ్ కుమార్ పోలీసుల్ని సంప్రదించాడు.
వారు కూడా ఇద్దర్నీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భార్య మాత్రం తనకు భర్తతో ఉండటం ఇష్టం లేదని, తనకు లవరే కావాలని తేల్చి చెప్పింది. దీంతో పోలీసుల సమక్షంలో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తన భార్య లవర్‌తో వెళ్లేందుకు భర్త అంగీకరించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

