USA : పశ్చిమాసియా యుద్ధంలో మూడో వారం ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రం చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద గ్యాస్ కేంద్రమైన అరామ్ కోర్‌పై ఇరాన్ దాడికి పాల్పడడంతో ఆగ్రహించిన అమెరికా తీవ్ర పరిణమాలు తప్పవని హెచ్చరిస్తోంది. ఇరాన్‌పై ఈ రోజు భారీ స్థయిలో దాడులకు పాల్పడుతామని, గల్ఫ్ యుద్ధాన్ని తమదైన స్టయిల్లో ముగిస్తామని అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ పీటె హేగ్‌సేథ్ (Pete Hegseth) హెచ్చరించారు.
ఇజ్రాయేల్‌తో కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తున్న అమెరికా గురువారం నుంచి వ్యూహం మార్చింది. ఇరాన్‌లోని గ్యాస్ కేంద్రాలపై గురి పెట్టింది. ప్రతిచర్యగా సౌదీ అరేబియాలని ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్యాస్ కేంద్ర అరామ్ కోర్‌పై ఇరాన్ మెరుపు దాడులు చేసింది. ఇరాన్ చర్యతో కంగుతిన్న అమెరికా గురువారం భారీ స్థాయిలో ఆ దేశంపై దాడులు చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ సెక్రటరీ పీటె హేగ్‌సేథ్ ఒక ప్రకటనలో తెలిపారు. చనిపోయిన వారిని గౌరవిస్తాం, అనుకున్న పనిని పూర్తి చేస్తాం అని చెప్పిన ఆయన మేము ఈ యుద్ధాన్ని ముగిస్తాం. సైనికుల ప్రాణ త్యాగాలను గౌరవిస్తాం అని యుద్ధంలో అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
BREAKING: “We will finish this. We will honor their sacrifice.” — Secretary of War Pete Hegseth pic.twitter.com/ZVhbrzi2Ri
— Fox News (@FoxNews) March 19, 2026
ఇరాన్‌పై యుద్ధానికి దిగిన మొదటి రోజు నుంచి మా లక్ష్యాల్లో ఏ మార్పూ లేదు. లక్ష్యంగా చేసుకొని ప్రణాళికలు రచిస్తాం. ఇరాన్ కొత్తగా బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసుకోలేదు. ఎందుకుంటే మేము వారి రక్షణ, క్షిపణి తయారీ కేంద్రాలను నాశనం చేశాం. అంతేకాదు ఇరాన్‌కు చెందిన 11సబ్మరైన్లను ముంచేశాం అని హేగ్‌సేథ్ వివరించారు. ఏయే లక్ష్యాలతో ఇరాన్లో యుద్ధం ప్రారంభించామో.. అవన్నీ సాధించి, మేము అనుకున్న మిషన్‌ను పూర్తి చేసేందుకు కంకణబద్ధులమై ఉన్నామని హేగ్‌సేథ్ వెల్లడించారు.