Ashok Kharat | క్షుద్ర పూజల పేరుతో మత్తుమందు ఇచ్చి మహిళలపై అత్యాచారాలు.. ఆస్ట్రాలజర్ అరెస్ట్
Ashok Kharat : భక్తి, క్షుద్ర పూజల పేరుతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఆస్ట్రాలజర్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు అశోక్ ఖారత్ పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలిసింది.
Ashok Kharat : భక్తి, క్షుద్ర పూజల పేరుతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఆస్ట్రాలజర్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు అశోక్ ఖారత్ పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలిసింది. ఒక బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అశోక్ ఖారత్.. మహారాష్ట్రలోని నాసిక్‌లో పేరుమోసిన ఆస్ట్రాలజర్. అతడి దగ్గరకు ఎందరో పెద్ద సెలబ్రిటీలు ఆస్ట్రాలజీ కోసం వస్తుంటారు. అతడు, తాను మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యానని చెబుతూ అందరితో కెప్టెన్ అని కూడా పిలిపించుకుంటాడు.
అతడి దగ్గరికి పురుషులతోపాటు మహిళలు కూడా వివిధ సమస్యల్తో, పరిష్కారం కోసం ఆస్ట్రాలజీ చూపించుకోవడానికి వస్తుంటారు. వారిలో కొందరు మహిళల్ని అశోక్ ఖారత్ మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తను చెప్పినట్లు చేయకపోతే వారి భర్తలు మరణిస్తారని మహిళల్ని నమ్మించేవాడు. పూజల పేరుతో తన ఫాంహౌజ్‌కు పిలిపించుకునేవాడు. అక్కడ పూజలు చేసే క్రమంలో ఎంతో మంది మహిళలపై మత్తు మందు ఇవ్వడం, హిప్నటైజ్ చేయడం ద్వారా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఒక మహిళ (35) ఏవో సమస్యలతో పరిష్కారం కోసం అతడి వద్దకు వచ్చింది. ఆ సమస్యలు తీరాలంటే కొన్ని పూజలు చేయాలని నమ్మించాడు. అలా ఆమెను తన ఫాంహౌజ్‌కు ఒంటరిగా పిలిపించి, పూజలు చేసే క్రమంలో మత్తు మందు ఇచ్చాడు. హిప్నటైజ్ చేసి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో అత్యాచారానికి గురైన మహిళ నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అతడు ఆ ఒక్క మహిళపైనే కాకుండా, పలువురిపై అత్యాచారానికి పాల్పడ్డట్లు తేలింది. ఇంట్లో అతడు అనేక చోట్ల సీసీ కెమెరాలతోపాటు రహస్య కెమెరాలు అమర్చాడు. అతడు చేసిన నేరాలకు సంబంధించిన పలు దృశ్యాలు వాటిలో రికార్డయ్యాయి. వాటికి సంబంధించిన పెన్ డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 58 మంది మహిళలకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను పోలీసులు గుర్తించారు. కేసు తీవ్రత దృష్ట్యా దీనిపై విచారణ జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ తేజస్విని ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది.
ఇక పోలీసులు అశోక్ ఖారత్‌ను అరెస్టు చేసేందుకు ఒక కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు. నిందితుడి ఇంటి నుంచి పిస్టోల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతడికి పలువురు మహారాష్ట్రతోపాటు జాతీయస్థాయి రాజకీయ నాయకులతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

