IPL 2026 : భారత గడ్డపై పుట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సీజన్ సీజన్‌కు మరింతగా అలరిస్తోంది. ఆటగాళ్ల మెరుపులు, రికార్డుల మోతలే కాదు కెప్టెన్ల ఎంపికతోనూ ఐపీఎల్ సరికొత్తగా సాగుతోంది. వేసవి వినోదాన్ని పంచేందుకు మరో తొమ్మిది రోజుల్లో 19వ సీజన్ ఐపీఎల్ షురూ కానుంది. ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా.. వరల్డ్‌కప్ హీరో ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తాత్కాలిక సారథిగా ఎంపికవ్వడం. అంతేకాదు.. పదికి పది జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్సీ వహించనుండడం మరో విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇలా మనోళ్లే అందరూ సారథులుగా ఉండడం ఇది రెండోసారి మాత్రమే.
ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటనతో ఫ్రాంచైజీలన్నీ జోరు పెంచాయి. కోచింగ్ నియామకాలను పూర్తి చేసిన జట్లు.. కెప్టెన్ ఎంపిక, ఆటగాళ్ల కసరత్తు వంటి విషయాల మీద దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే పంతొమ్మిదో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువకెరటం ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక సారథిగా ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడంతో.. అతడు వచ్చేంత వరకూ ఇషాన్‌కు పగ్గాలు అప్పగించింది.
With Ishan Kishan stepping in for Pat Cummins, the upcoming IPL will be just the second season to start with all Indian captains – in 2019, Bhuvneshwar Kumar captained the first game for SRH in Kane Williamson’s absence 🔁 pic.twitter.com/yfUaLOwBLm
— ESPNcricinfo (@ESPNcricinfo) March 19, 2026
దాంతో, ఈసారి ఐపీఎల్లో పది జట్లకు కెప్టెన్లుగా భారతీయులే వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ చరిత్రలో అందరూ భారత ఆటగాళ్లే జట్టును నడిపించడం ఇది రెండోసారి. 2019లో తొలిసారి పది జట్లకు భారత క్రికెటర్లే సారథిగా ఉన్నారు. అప్పుడు కూడా సన్‌రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్ అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్ కుమార్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీకి ఇషాన్ కెప్టెన్వవడంతో ఇండియన్ స్కిప్పర్స్ సంఖ్య పదికి చేరింది.
గుజరాత్ టైటాన్స్ – శుభ్‌మన్ గిల్
ముంబై ఇండియన్స్ – హార్దిక్ పాండ్యా
ఢిల్లీ క్యాపిటల్స్ – అక్షర్ పటేల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ – ఇషాన్ కిషన్
పంజాబ్ కింగ్స్ – శ్రేయాస్ అయ్యర్
రాజస్థాన్ రాయల్స్ – రియాన్ పరాగ్
చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్
లక్నో సూపర్ జెయింట్స్ – రిషభ్ పంత్
కోల్‌కతా నైట్ రైడర్స్ – అజింక్యా రహానే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రజత్ పాటిదార్
పన్నెండో సీజన్ ఐపీఎల్లో 9 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరుగగా.. ఒక్క పరుగు తేడాతో ముంబై విజేతగా నిలిచింది.
ముంబై ఇండియన్స్ – రోహిత్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ – శ్రేయాస్ అయ్యర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ – భువనేశ్వర్ కుమార్(కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో)
కింగ్స్ లెవన్ పంజాబ్ – ఆర్ అశ్విన్
రాజస్థాన్ రాయల్స్ – అజింక్యా రహానే
చెన్నై సూపర్ కింగ్స్ – ఎంఎస్ ధోనీ
లక్నో సూపర్ జెయింట్స్ – రిషభ్ పంత్
కోల్‌కతా నైట్ రైడర్స్ – దినేశ్ కార్తిక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విరాట్ కోహ్లీ