బీబీనగర్, ఆగస్టు 14: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రం నుంచి జైనపల్లికి వెళ్లే రహదారిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇనుప రాడ్తో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడికి యత్నించడంతో పాటు వాహనాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు 100కు సమాచారం అందించారు.
దీంతో పెట్రో మొబైల్ కానిస్టేబుళ్లు అరవింద్, శేఖర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఇనుప రాడ్తో వీరంగం సృష్టిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.