IQOO Neo 11 | ఐక్యూ నియో 11 అల్ట్రా వచ్చేస్తోంది.. ‘మాన్స్టర్’ చిప్‌తో దుమ్మురేపేలా!
IQOO Neo 11 | ఐక్యూ నియో 11 అల్ట్రా ఆగస్టు 18న చైనాలో విడుదల కానుంది. మీడియాటెక్‌తో కలిసి ప్రత్యేకంగా రూపొందించిన డైమెన్సిటీ 9500ఎం చిప్, ‘మాన్స్టర్ సూపర్ కోర్ ఇంజిన్’, 2,000 నిట్స్ డిస్ప్లే వంటి ఫీచర్లతో వస్తోంది.
IQOO Neo 11 | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో పవర్ఫుల్ ఫోన్ సందడి చేయనుంది. వివో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీకి చెందిన ఐక్యూ (iQOO) కొత్తగా నియో 11 అల్ట్రాను తీసుకొస్తోంది. చైనాలో ఆగస్టు 18న ఈ ఫోన్ అధికారికంగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఫోన్ విడుదలకు ముందు కంపెనీ కీలక ఫీచర్లను వెల్లడించింది. ముఖ్యంగా మీడియాటెక్‌తో కలిసి ప్రత్యేకంగా రూపొందించిన డైమెన్సిటీ 9500ఎం చిప్సెట్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
మీడియాటెక్‌తో కలిసి.. ప్రత్యేక చిప్!
ఐక్యూ నియో 11 అల్ట్రాలో 3ఎన్ఎం ప్రాసెస్‌పై తయారైన ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎం చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఐక్యూ, మీడియాటెక్ కలిసి ప్రత్యేకంగా ఈ చిప్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. మెరుగైన పనితీరుతో పాటు పవర్ వినియోగాన్ని తగ్గించేలా దీనిని రూపొందించినట్లు పేర్కొంది.
ఈ చిప్‌లోనే ‘మాన్స్టర్ సూపర్ కోర్ ఇంజిన్’ను నేరుగా ఇంటిగ్రేట్ చేసినట్లు ఐక్యూ చెబుతోంది. దీంతో గేమింగ్, మల్టీటాస్కింగ్, ఇతర పనుల్లో ఫోన్ వేగంగా పనిచేసే అవకాశం ఉంది.
2,000 నిట్స్ డిస్ప్లే
నియో 11 అల్ట్రా డిస్ప్లే కూడా ప్రత్యేకంగా నిలవనుంది. ఎఫ్2 ల్యూమినస్ మెటీరియల్‌తో కూడిన డిస్ప్లేను అందిస్తున్న తొలి ఫోన్‌గా దీనిని కంపెనీ ప్రకటించింది. స్క్రీన్ మొత్తం మీద గరిష్ఠంగా 2,000 నిట్స్ బ్రైట్నెస్ అందించనున్నట్లు తెలిపింది.
అంతేకాదు.. అవుట్‌డోర్‌లో స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 98 శాతం ఫస్ట్ ఫ్రేమ్ బ్రైట్నెస్ రేషియో ఉంటుందని పేర్కొంది. కంటి రక్షణ కోసం హానికరమైన బ్లూ లైట్ ఉద్గారాలు 5 శాతం కంటే తక్కువగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. ‘సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ 2.0’ టెక్నాలజీతో మరింత సహజమైన కాంతిని అందించనున్నట్లు వెల్లడించింది. స్క్రీన్ కనీస బ్రైట్నెస్ 1 నిట్ వరకు తగ్గించుకోవచ్చు.
9.13 మి.మీ మందం.. మూడు రంగుల్లో
డిజైన్ పరంగానూ నియో 11 అల్ట్రా ప్రత్యేకంగా కనిపించనుంది. వెనుక భాగంలో ‘3డీ ఫ్లోయింగ్ లైట్ ఎఫెక్ట్’, మెటల్ ఫ్రేమ్, మ్యాట్ ఫినిష్, ‘ఆర్-కార్నర్స్’తో వస్తుంది. ఫోన్ మందం 9.13 మి.మీ.గా ఉండనుంది.
లైట్ వైట్, షాడో బ్లాక్, విండ్ ఛేజర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. చైనాలో ఆగస్టు 18న సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు) లాంచ్ కానుంది. అదే సమయంలో ఐక్యూ జెడ్11ఎస్ కూడా విడుదల కానుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

