Aakasamlo Oka Tara | బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ జోరు.. మంగళవారం కూడా అదిరిపోయే వసూళ్లు!
Aakasamlo Oka Tara | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ స్పందన అందుకుంటున్న ఈ ఎమోషనల్ డ్రామా.. రోజులు గడుస్తున్నా తన పట్టును నిలబెట్టుకుంటోంది.
Aakasamlo Oka Tara | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ స్పందన అందుకుంటున్న ఈ ఎమోషనల్ డ్రామా.. రోజులు గడుస్తున్నా తన పట్టును నిలబెట్టుకుంటోంది. ముఖ్యంగా వారాంతపు వసూళ్ల తర్వాత కూడా వీక్ డేస్‌లో మంచి ఆక్యుపెన్సీ నమోదు చేస్తుండటం చిత్రబృందానికి ఊరటనిస్తోంది. తాజాగా మంగళవారం కూడా ఈ సినిమా మంచి సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సెలవు ఉండటంతో సినిమాకు అదనపు ప్రయోజనం కలిగింది. ఈ సెలవు ప్రభావంతో థియేటర్లలో ఆక్యుపెన్సీలు బాగున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం ‘ఆకాశంలో ఒక తార’ సినిమా సుమారు 74 వేల టికెట్లు అమ్ముడుపోయాయి.
అంతకుముందు సోమవారం ఈ చిత్రం దాదాపు 86 వేల టికెట్లను విక్రయించింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం టికెట్ల విక్రయాల్లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, వీక్ డేలోనూ ఈ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మంచి సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా వసూళ్లలో పెద్దగా డ్రాప్ లేకుండా నిలకడగా కొనసాగుతుండటం ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంటోంది. సాధారణంగా సినిమాలకు మొదటి వారాంతంలో మంచి వసూళ్లు వచ్చినా, సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ‘ఆకాశంలో ఒక తార’ విషయంలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని తాజా టికెట్ విక్రయాల గణాంకాలు సూచిస్తున్నాయి. సోమవారం, మంగళవారం మధ్య టికెట్ల అమ్మకాల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం సినిమాకు ఉన్న ప్రేక్షకాదరణను తెలియజేస్తోంది.
ఇదే ట్రెండ్ రాబోయే రోజుల్లోనూ కొనసాగితే సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత స్థిరమైన వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుండటం కలిసొచ్చే అంశంగా మారింది. ఈ వారాంతంలో శర్వానంద్ నటించిన ‘భోగి’ మినహా చెప్పుకోదగ్గ పెద్ద సినిమాల విడుదల పెద్దగా లేకపోవడం కూడా ‘ఆకాశంలో ఒక తార’కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. కొత్త సినిమా నుంచి ఎలాంటి పోటీ ఎదురవుతుందనేది పక్కన పెడితే, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రేక్షకాదరణను ఈ చిత్రం నిలబెట్టుకోగలిగితే థియేటర్లలో మరికొన్ని రోజులు మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయమయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ జోరు.. మంగళవారం కూడా అదిరిపోయే వసూళ్లు!
సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
Bandla Ganesh | బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదుదారుడి కీలక ప్రకటనతో ఊరట!
Pakistan Astronaut | చైనా నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి పాక్ వ్యోమగామి.. 40 ఏళ్ల క్రితమే చరిత్ర సృష్టించిన భారత్!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

