Garividi Lakshmi | ఓటీటీలోకి గరివిడి లక్ష్మి బయోపిక్.. రేపటి నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
Garividi Lakshmi | ఉత్తరాంధ్ర జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రారంభంలో నెమ్మదిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం అనూహ్యమైన స్పందనను సొంతం చేసుకుంది.
Garividi Lakshmi | ఉత్తరాంధ్ర జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రారంభంలో నెమ్మదిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం అనూహ్యమైన స్పందనను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వరుసగా హౌస్‌ఫుల్ షోలు పడటంతో బాక్సాఫీస్ వద్ద అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన కీలక అప్డేట్ వెలువడింది.థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ చెప్పింది. ‘గరివిడి లక్ష్మి’ సినిమా నవంబర్ 26 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఐదు భాషల ప్రేక్షకులు ఈ బయోపిక్‌ను ఇంటి వద్ద నుంచే వీక్షించే అవకాశం కలగనుంది.‘గరివిడి లక్ష్మి’ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. విడుదలైన తొలిరోజుల్లో పెద్దగా సందడి చేయకపోయినా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం ఈ చిత్రం అనూహ్యమైన ఆదరణను పొందింది. అక్కడి ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టడంతో వరుసగా హౌస్‌ఫుల్ షోలు నమోదయ్యాయి. అంతేకాదు, ఉత్తరాంధ్రలో వచ్చిన వసూళ్లు మిగిలిన ప్రాంతాలన్నింటి కలెక్షన్లను కలిపినా వాటికంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఒక ప్రాంతంలో మాత్రమే ఈ స్థాయిలో స్పందన రావడం సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం, ఆమె ప్రయాణం ఆధారంగా ఈ బయోపిక్‌ను రూపొందించారు. ఇందులో హీరోయిన్ ఆనంది టైటిల్ పాత్రలో నటించారు. గరివిడి లక్ష్మి పాత్రలో ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గౌరి నాయుడు జమ్ము ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, రాశి, రాగ్ మయూర్, శ్రీనివాస్ అవసరాల, అంకిత్ కొయ్య, ఎల్బీ శ్రీరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. జానపద కళాకారిణి జీవితంలోని సంఘటనలు, ఆమె కళా ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నంగా ఈ బయోపిక్ రూపొందింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi | ఓటీటీలోకి గరివిడి లక్ష్మి బయోపిక్.. రేపటి నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
HMDA | భూములను అమ్మడమే రేవంత్ రెడ్డి ప్రజాపాలన? : ఎమ్మెల్యే కృష్ణారావు
Aakasamlo Oka Tara | బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ జోరు.. మంగళవారం కూడా అదిరిపోయే వసూళ్లు!
సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

