Not A Mahatma | ‘నాట్ ఎ మహాత్మా’.. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షపై డాక్యుమెంటరీ వెబ్ సిరీస్.. ట్రైలర్ విడుదల!
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక మలుపైన 2009 ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో ‘నాట్ ఎ మహాత్మా’ (Not A Mahatma) పేరుతో ఓ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ రాబోతోంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాజకీయ ప్రస్థానం, ప్రత్యేక రాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన 2009 ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంతో ఓ ఆసక్తికర డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ రాబోతోంది. ‘నాట్ ఎ మహాత్మా’ (Not A Mahatma) పేరుతో తెరకెక్కుతున్న ఈ డాక్యూ సిరీస్ ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.
భారతదేశానికి మహాత్మా గాంధీ అహింసాయుత ఆమరణ నిరాహార దీక్షల ద్వారా స్వాతంత్ర్యం తీసుకురాగా, అదే తరహాలో కేసీఆర్ అహింసాయుత ఆమరణ దీక్ష వల్లే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా సిద్ధించింది. అయితే, ఆ చారిత్రక ఘట్టం వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏంటి? అనే కోణంలో ఈ సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్ స్పష్టం చేశారు. మొత్తం నాలుగు ఎపిసోడ్లుగా రానున్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ ద్వారా 2009లో కేసీఆర్ చేపట్టిన దీక్షకు సంబంధించిన వాస్తవాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా వెల్లడించారు.
తెలుగులో ‘ఓయ్!’ వంటి చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు ఆనంద్ రంగ ఈ డాక్యూ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చరిత్ర, ఉద్యమ మలుపులను లోతుగా విశ్లేషిస్తూ ఆనంద్ రంగ ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా మలిచినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ‘అనగనగా ఫిల్మ్ కంపెనీ’ (Anaganagana Film Company) బ్యానర్‌పై పట్టాభి ఆర్ చిలుకూరి ఈ సిరీస్‌ను రూపొందించగా, ముత్యాల సుధీర్ రెడ్డి సహ-దర్శకుడిగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం విడుదలైన ‘నాట్ ఎ మహాత్మా’ ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగుతూ, తెలంగాణ చరిత్రలోని ఈ కీలక అధ్యాయాన్ని దర్శకుడు ఏ విధంగా ఆవిష్కరించబోతున్నారనే ఆసక్తిని అందరిలోనూ రేకెత్తిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- AnandRanga
- BRS
- KCR
- NotAMahatma
RELATED ARTICLES
తాజా వార్తలు
Not A Mahatma | ‘నాట్ ఎ మహాత్మా’.. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షపై డాక్యుమెంటరీ వెబ్ సిరీస్.. ట్రైలర్ విడుదల!
Garividi Lakshmi | ఓటీటీలోకి గరివిడి లక్ష్మి బయోపిక్.. రేపటి నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
HMDA | భూములను అమ్మడమే రేవంత్ రెడ్డి ప్రజాపాలన? : ఎమ్మెల్యే కృష్ణారావు
Aakasamlo Oka Tara | బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ జోరు.. మంగళవారం కూడా అదిరిపోయే వసూళ్లు!
సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

