Massive Pythons : ఒకేచోట కుప్పగా ఉన్న కొండచిలువల (Group of Pythons) గుంపు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఏకంగా ఐదారు భారీ కొండచిలువల గుంపు కదలకుండా పడుకుని కనిపించడం కలకలం రేపింది. హిమాచల్ ప్రదేశ్ (Himachalpradesh) రాష్ట్రం కాంగ్రా జిల్లా (Congra district) లోని గహ్లియాన్ (Gahlian) ప్రాంతంలోగల ప్రసిద్ధ కాళోఠారే వాలీ మాత ఆలయం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. మొదట ఆ పాములను చూసి నేల మీద పరుచుకున్న చెట్టు వేర్లుగా భావించారు. అవి కొండచిలువలు అని ఎవరూ అనుమానించలేదు.
అయితే కొందరు అనుమానంతో ఆ గుంపుపైకి రాయి విసరడంతో అసలు విషయం బయటపడింది. ఆ కొండచిలువల గుంపు ఒక్కసారిగా కదిలింది. దాంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అవి భారీ కొండచిలువలు అని గ్రహించి భయంతో పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సుమారు 5 నుంచి 6 భారీ కొండచిలువలు ఆ గుంపులో ఉన్నాయి. జనం గమనించిన కొద్దిసేపటికే అవి వేగంగా చెల్లాచెదురై సమీపంలోని పొదల్లోకి జారుకున్నాయి.
ఈ భయానక దృశ్యాన్ని అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది. ఇంత పెద్ద సంఖ్యలో కొండచిలువలు ఒకేచోట గుంపుగా కనిపించడం చాలా అరుదని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆలయానికి సమీపంలో, అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివసించే ప్రజల్ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు కొండచిలులువలు మనుషుల జోలికి రావని, తమంతట తాముగా దాడి చేయవని చెప్పారు. అయితే వాటిని రెచ్చగొట్టినా, ఇబ్బంది పెట్టినా లేదా వాటికి అపాయం ఉందని భావించినా అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
#Watch | Group of Massive Pythons Seen Near Temple in Himachal, Locals Terrified pic.twitter.com/CDEGy8n5UD
— NDTV (@ndtv) March 19, 2026