Dhurandhar The Revenge | ‘ధురంధర్: ది రివెంజ్’ రివ్యూ.. రణ్వీర్ సింగ్ విశ్వరూపం ఎలా ఉంది?
Dhurandhar 2 | భారతీయ సినీ చరిత్రలో స్పై థ్రిల్లర్లకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
చిత్రం: ధురంధర్: ది రివెంజ్
నటీనటులు: రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, రాకేశ్ బేడి తదితరులు
దర్శకత్వం: ఆదిత్య ధర్
సంగీతం: సచ్దేవ్ ది
సినిమాటోగ్రఫీ: వికాస్ నౌలఖా
విడుదల తేదీ: 19 మార్చి, 2026
భారతీయ సినీ చరిత్రలో స్పై థ్రిల్లర్లకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’తో దేశభక్తిని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్‌తో కలిసి రూపొందించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్: ది రివెంజ్’. మొదటి భాగం సృష్టించిన సంచలనం తర్వాత, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీక్వెల్ అంచనాలను అందుకుందా? రణ్వీర్ సింగ్ యాక్షన్ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
కథ
ఆపరేషన్ ‘ధురంధర్’లో భాగంగా భారత గూఢచారి జస్కిరాత్ సింగ్ తన గుర్తింపును మార్చుకుని హమ్జా అలీ మజారీ (రణ్వీర్ సింగ్) పేరుతో పాకిస్థాన్‌లోని ల్యారీ పట్టణంలో అడుగుపెడతాడు. అక్కడ బలమైన నాయకుడు రెహమాన్ డెకాయిత్ను అంతం చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. అక్కడ అధికారం కోసం జరిగే గ్యాంగ్ వార్‌లో హమ్జా తన తెలివితేటలతో పావులు కదుపుతాడు. అయితే, పాక్ ఆర్మీకి చెందిన మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ముప్పు పొంచి ఉంటుంది. భారత్‌పై ఉగ్రదాడికి కుట్ర పన్నిన శక్తులను హమ్జా ఎలా అడ్డుకున్నాడు? జస్కిరాత్ గతం ఏంటి? అనేదే ఈ చిత్ర కథాంశం.
విశ్లేషణ
దర్శకుడు ఆదిత్య ధర్ ఒక గూఢచారి కథను కేవలం యాక్షన్ డ్రామాగా మాత్రమే కాకుండా, మైండ్ గేమ్‌గా మలిచారు. సినిమా ప్రారంభంలో జస్కిరాత్ సింగ్ గతాన్ని చూపించి, ఆ పాత్రలోని హింసకు గల కారణాన్ని బలంగా స్థాపించారు. మొదటి భాగం ల్యారీ పట్టణంలో సాగే ఆధిపత్య పోరు, హమ్జా వేసే రాజకీయ ఎత్తుగడలతో ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, మధ్యలో ఉగ్రవాద మూలాలు, నకిలీ కరెన్సీ వంటి అంశాలను వివరించే క్రమంలో కథ కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. నోట్ల రద్దు సీన్ మంచి జోష్ నింపిన ఒక పార్టీకి చెందిన ప్రచారంలా అనిపిస్తుంది. అయితే ఈ సీన్‌తో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. హమ్జాను కాపాడే క్రమంలో వచ్చే ఎమోషనల్ సీన్లు కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా 26/11 దాడుల కుట్రదారులను ఏరివేసే సన్నివేశాలు, ఐసీ-814 హైజాక్ ప్రస్తావన ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.
నటీనటుల పనితీరు
రణ్వీర్ సింగ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. గూఢచారిగా ఆయన చూపిన వేరియేషన్స్, యాక్షన్ సీన్లలో పలికించిన పౌరుషం అద్భుతం. విలన్‌గా అర్జున్ రాంపాల్ క్రూరత్వం, సంజయ్ దత్ గంభీరమైన నటన సినిమాకు బలాన్ని ఇచ్చాయి. ఐబీ చీఫ్‌గా మాధవన్ తనదైన శైలిలో రాణించగా, రాకేశ్ బేడి కామెడీ అక్కడక్కడ నవ్వులు పూయిస్తుంది.
సాంకేతిక విభాగం
సచ్దేవ్ నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరో మెట్టు ఎక్కించింది. వికాస్ నౌలఖా విజువల్స్ పాకిస్థాన్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఆదిత్య ధర్ టేకింగ్ రియలిస్టిక్‌గా ఉండటంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మెప్పించింది.
ప్లస్ పాయింట్లు:
రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ నటన
ద్వితీయార్ధంలో సాగే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే
హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ మరియు క్లైమాక్స్
ఉత్కంఠ రేకెత్తించే నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్లు:
ప్రథమార్ధంలో సాగదీతగా అనిపించే కొన్ని సన్నివేశాలు
సినిమా నిడివి (Length) ఎక్కువగా ఉండటం
కొందరికి అధికార పార్టీకి చెందిన ప్రచార చిత్రంలా అనిపించడం
కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం
తీర్పు
మొత్తంగా చెప్పాలంటే, ‘ధురంధర్: ది రివెంజ్’ ఒక పక్కా ఇంటెన్స్ స్పై థ్రిల్లర్. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. మొదటి భాగం చూసిన వారికి ఇది బాగా కనెక్ట్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

