Mission Bhageeratha | ప్రతి రోజు మిషన్ భగీరథ నీరు.. గ్రామంలోని ప్రతీ ఇంటికి వాటర్ క్యాన్
Mission Bhageeratha | ప్రజలకు ప్రతిరోజు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని, ఇందుకుగాను ఆయా వార్డులో ప్రత్యేకంగా గేటు వాల్వ్ లు బిగించామని వెల్లడించారు. దానితోపాటు అవసరం ఉన్నవారు ఫిల్టర్ వాటర్ తెచ్చుకునేందుకు ఈ క్యాన్లు అందజేశామని వెల్లడించారు.
Mission Bhageeratha | బచ్చన్నపేట, మార్చి 19 : గ్రామంలోని ప్రతీ ఇంటికి కొత్త వాటర్ క్యాన్లు అందించడం జరిగిందని పడమటి కేశవాపూర్ సర్పంచ్ ఎర్రోళ్ల విజయ సోములు అన్నారు. గురువారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం పురస్కరించుకొని క్యాన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో పంపిణీ చేసిన అనంతరం, అక్కడికి రాని వారి ఇంటింటికి వెళ్లి వాటర్ క్యాన్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ప్రతిరోజు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని, ఇందుకుగాను ఆయా వార్డులో ప్రత్యేకంగా గేటు వాల్వ్ లు బిగించామని వెల్లడించారు. దానితోపాటు అవసరం ఉన్నవారు ఫిల్టర్ వాటర్ తెచ్చుకునేందుకు ఈ క్యాన్లు అందజేశామని వెల్లడించారు. గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆమె స్పష్టం చేశారు. ప్రజల మౌలిక అవసరాలు తీర్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రొల్ల విజయ సోములు ఉప సర్పంచ్ తాడెం నరేందర్, ఈమైనా భాగ్య, తరిగొప్పుల బాలమణి,యాసరేని వెంకటేష్, గిద్దల రాజు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చల్ల తిరుపతి రెడ్డీ, సీనియర్ నాయకులు వేముల మహాదేవ్, జంగిటి ప్రభాకర్ తాడేం నర్సింలు, తరిగొప్పుల నర్సింలు,,వనం బాలకిషన్, గడిల భాస్కర్ రెడ్డి, శేరి యాదగిరి,,గంగరమైన సుధాకర్, గజ్వేల్ రమేష్, గిద్దల బాలకిషన్, గద్దరాజు రాజు గిద్దల భాస్కర్, యూత్ అధ్యక్షులు వేముల, హరి కృష్ణ ఆరేపల్లి కర్ణాకర్, పెద్దారం ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం గ్రామానికి చెందిన యాదగిరి కూల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయగా గ్రామ సర్పంచ్ విజయ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాడెం నరేందర్, షేరి యాదగిరి పాల్గొన్నారు.
Read Also :
PM Modi | తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, గవర్నర్
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రివ్యూ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎలా ఉంది.!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

