హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ యోధుడు, ప్రజా నాయకుడు పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
పండుగ సాయన్న సేవలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలని సీఎంను కోరారు. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-డీ క్యాటగిరీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని విజ్ఞప్తిచేశారు.