న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రభుత్వరంగ బ్యాంకులు రుణ గ్రహీతలకు షాకిచ్చాయి. రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ రెండు ప్రభుత్వ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి.
వీటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్లు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు సవరించాయి. బ్యాంక్లు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రుణ గ్రహీతలు అధికంగా ఈఎంఐలు చెల్లించాల్సివుంటుంది.