బెంగళూరు: రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోలో మహిళ మృతదేహం కనిపించింది. ఎవరో ఆమెను హత్య చేసి మృతదేహన్ని ఆటోలో వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. (Woman’s Body In Auto) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. శనివారం తిలక్‌నగర్‌లోని ప్రధాన రహదారిపై నిలిచి ఉన్న ఆటోలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళను 35 ఏళ్ల సల్మాగా గుర్తించారు. పెళ్లై నలుగురు పిల్లలున్న ఆమె భర్త ఇటీవల మరణించినట్లు తెలుసుకున్నారు. తెలిసిన వ్యక్తి ఎవరో సల్మా తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోలో వదిలేశారని భావిస్తున్నారు.
మరోవైపు సల్మా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆమె హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి గురించి ఆధారం లభించిందని, అతడ్ని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Beaten To Death | వివాహేతర సంబంధం కారణంగా.. వ్యక్తిని కట్టేసి కొట్టి చంపారు
Watch: బైక్ స్టంట్‌లో బీటెక్ విద్యార్థి మృతి.. స్కిడ్ కావడంతో ఎగసిన నిప్పురవ్వలు