ముంబై: ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే డాక్టర్‌కు అక్కడ పని చేసే మహిళా సిబ్బందితో సంబంధం ఏర్పడింది. ఆమె సోదరుడు దీనిని వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్‌ను కత్తితో పొడిచాడు. (Doctor Stabbed By Woman Staff’s Brother) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక వైద్యుడికి అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బందితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె సోదరుడు దీనిని వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆ డాక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్‌కు అదే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: బాలిక పైనుంచి కారు నడిపిన మైనర్ బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ఆసక్తి రేపుతున్న డ్రైవర్‌లెస్ కారు.. వీడియో వైరల్