బెంగళూరు: ఒక కాలేజీ క్యాంపస్‌లో డ్రైవర్ లేని కారు సందడి చేసింది. ఇది అందరినీ ఆకట్టుకున్నది. కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఈ డ్రైవర్‌లెస్ కారులో (Driverless Car) ఒక స్వామీజీతో పాటు మరికొందరు వ్యక్తులు ప్రయాణించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉత్తరాది మఠానికి చెందిన సత్యాత్మతీర్థ స్వామీజీ, బెంగళూరులోని ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ క్యాంపస్‌లో ఆయనతోపాటు మరికొందరు డ్రైవర్‌లెస్ కారులో ప్రయాణించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ డ్రైవర్‌లెస్ కారు అందరిలో ఆసక్తి రేపింది. విప్రో, ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మధ్య సహకారంతో ఈ డ్రైవర్‌లెస్ కారును అభివృద్ధి చేస్తున్నారు.
మరోవైపు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్వర్క్ కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన డ్రైవర్ అవసరం లేని కారును దేశ రహదారుల పరిస్థితులకు అనుగుణంగా పరీక్షించి తీర్చిదిద్దుతున్నారు. పూర్తిగా సిద్ధమైన తర్వాత ఈ డ్రైవర్‌లెస్ కారును అధికారికంగా ప్రారంభించనున్నారు.
DRIVERLESS CAR BUILT BY WIPRO, IISC & RV COLLEGE UNVEILED IN BENGALURU!
A major milestone in India’s innovation journey!Wipro, Indian Institute of Science (IISc), and RV College of Engineering have together unveiled a driverless car, part of the WIRIN (Wipro-IISc Research &… pic.twitter.com/ObOBdxoZhb
— Karnataka Portfolio (@karnatakaportf) October 28, 2025
Also Read:
DK Shivakumar | కారు లేని అబ్బాయిలతో అమ్మాయిలకు పెళ్లి చేయరు: డీకే శివకుమార్
Watch: బాలిక పైనుంచి కారు నడిపిన మైనర్ బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మంటల్లో దగ్ధమైన బస్సు.. డ్రైవర్ అలెర్ట్‌తో ప్రయాణికులు సురక్షితం