బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కారు లేని అబ్బాయిలకు తమ అమ్మాయిలను ఇచ్చి జనం పెళ్లి చేయబోరని అన్నారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికే బెంగళూరు సొరంగం రోడ్డు ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య, మంగళవారం డీకే శివకుమార్‌ను కలిశారు. పర్యావరణానికి ముప్పు కలిగించే సొరంగం రోడ్డు ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బస్సులు, మెట్రో రవాణాను విస్తరించాలని సూచించారు.
కాగా, బీజేపీ ఎంపీతో సమావేశం తర్వాత డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. జనం కార్లు కొనడం వెనుక ఉన్న సామాజిక బాధ్యతలను తేజస్వి సూర్య అర్థం చేసుకోలేదని అన్నారు. ‘మీరు మీ వాహనాన్ని తీసుకురాకుండా నేను ఆపగలనా? ఇది సామాజిక బాధ్యతకు సంబంధించిన విషయం. ప్రజలు తమ కుటుంబాలతో కలిసి తమ సొంత వాహనాల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు. వారు తమ కార్లను ఉపయోగించకుండా మనం నిరోధించగలమా? కార్లను ఇంట్లో వదిలి ప్రజా రవాణాను ఉపయోగించమని తమ నియోజకవర్గ ప్రజలకు ఎంపీలు విజ్ఞప్తి చేయవచ్చు. ఎంతమంది దానిని నిజంగా అనుసరిస్తారో చూద్దాం. నేడు ప్రజలు తమ కుమార్తెలను కారు లేని అబ్బాయిలకు ఇచ్చి వివాహం చేయడానికి కూడా వెనుకాడతారు’ అని అన్నారు. ఐటీ రాజధానిలో ట్రాఫిక్ సమస్యలకు సొరంగం రోడ్డు ప్రాజెక్టు దీర్ఘకాలిక పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.
Deputy CM DK Shivakumar says it has become a social obligation to use private cars instead of public transport in Bengaluru.
What’s your take on this ? pic.twitter.com/8tahvqBgvz— Deepak Bopanna (@dpkBopanna) October 29, 2025
Also Read:
BJP Leader’s Killers Arrested | బీజేపీ నేత హంతకులు.. ఎన్కౌంటర్లో అరెస్ట్
Watch: మంటల్లో దగ్ధమైన బస్సు.. డ్రైవర్ అలెర్ట్‌తో ప్రయాణికులు సురక్షితం
Watch: బాలిక పైనుంచి కారు నడిపిన మైనర్ బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?