అహ్మదాబాద్: మైనర్ బాలుడు కారు డ్రైవ్ చేశాడు. ఒక వీధి మలుపులో మూడేళ్ల బాలిక పైనుంచి కారు నడిపాడు. (Minor Boy Runs Car Over Girl) అదృష్టవశాత్తు ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. అయితే కారు నడిపిన ఆ బాలుడిపై ఆ చిన్నారి తల్లిదండ్రులు దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం శివ్ బంగ్లా రెసిడెన్షియల్ ప్రాంతంలోని వీధిలో కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు.
కాగా, ఒక మైనర్ బాలుడు కారు డ్రైవ్ చేశాడు. వీధి మలుపు వద్దకు మూడేళ్ల బాలిక వచ్చింది. టర్న్ తీసుకుంటున్న కారును చూసి వెనుకకు పరుగెత్తింది. అయితే ఆ బాలుడు ఆ బాలిక పైనుంచి కారు నడిపాడు. అదృష్టవశాత్తు కారు టైరు కింద ఆ చిన్నారి పడలేదు. కారు మధ్యలో పడిన బాలిక దాని వెనుక నుంచి బయటకు వచ్చింది.
మరోవైపు ఇది చూసిన స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కారు దిగిన ఆ బాలుడు, బాలిక గాయపడిందా? అన్నది పరిశీలించాడు. ఇంతలో ఆ చిన్నారి తల్లిదండ్రులు అతడ్ని చుట్టుముట్టి కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలుడు నడిపిన కారు యజమానిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
अहमदाबाद
नोबलनगर इलाके में कार चालक ने बच्ची को कुचला
हादसे में 3 साल की बच्ची का बचाव
नाबालिग किशोर ने बच्ची को कार से कुचला
बच्ची बंगले के कोमन प्लॉट में खेल रही थी#Accident #CCTV #Gujarat #Ahmedabad pic.twitter.com/pC5bZxu1BY
— Naresh Parmar (@nareshsinh_007) October 29, 2025