ముంబై: ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి. (Bus Catches Fire) అయితే డ్రైవర్ అలెర్ట్‌తో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఆ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన లగ్జరీ స్లీపర్ బస్సు ముంబై నుంచి జల్నాకు వెళ్తున్నది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాగ్‌పూర్ జాతీయ రహదారిలో ఆ బస్సుకు మంటలు అంటుకున్నాయి.
కాగా, మంటలను గమనించిన డ్రైవర్ హుస్సేన్ సయ్యద్ అలెర్ట్ అయ్యాడు. బస్సును వెంటనే రోడ్డు పక్కన ఆపాడు. అందులో ఉన్న 12 మంది ప్రయాణికులను సకాలంలో నుంచి దించివేశాడు. ఆ తర్వాత ఆ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. అంబులెన్సులు కూడా అక్కడకు చేరుకున్నాయి. ప్రయాణికులంతా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, బస్సు కాలిపోవడానికి కారణం ఏమిటన్నదని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన వల్ల ఆ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు మంటల్లో కాలుతున్న బస్సు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | A private luxury bus traveling from Mumbai to Jalna caught fire early this morning on the Samruddhi Highway. The bus had 12 passengers along with the driver and his assistant. All passengers were safely evacuated.
(Video courtesy : X) pic.twitter.com/asZ2ZXnVeS— Deccan Chronicle (@DeccanChronicle) October 29, 2025
Also Read:
Bus caught fire | కర్నూలు ఘటన మరవకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం.. పలువురు మృతి
Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం.. బస్సుకు అంటుకున్న నిప్పు
Watch: ఆన్లైన్లో అమ్మాయిని వేధించిన వ్యక్తి.. ఆమె స్నేహితులు ఏం చేశారంటే?